Navaratri 2023 : మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించే ‘శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి’

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత.. ఈరోజు అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సువాసినులకు మాంగళ్య సౌభాగ్యం ప్రసాదిస్తుంది అమ్మవారు.

Navaratri 2023

Navaratri 2023 : నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని కొలిస్తే దారిద్ర్యం తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.

Navaratri 2023 : నవరాత్రుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదో తెలుసా?.. ఈ కథలో

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత. పంచదశాక్షరీ మహా మంత్రానికి అధిష్టాన దేవతగా అమ్మవారిని ఆరాధిస్తారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి దారిద్ర్యాన్ని తొలగించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు ఈరోజు బంగారం రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి కలువపూలతో అమ్మవారికి పూజ చేస్తారు. నైవేద్యంగా దద్ధోజనం, పరమాన్నం పెట్టాలి. ఈరోజు సహస్రనామ పుస్తకాలు దానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని పూజిస్తే కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. 9 రోజులు అమ్మవారిని పూజించడం వీలు పడని వారు మొదటి మూడు రోజులు లేదా తర్వాత మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు పూజిస్తారు.

Garba Song : శరన్నవరాత్రుల వేళ.. మోదీ రాసిన ‘గర్బా’ పాట

శ్రీ చక్రానికి కుంకుమార్చన, లలితా అష్టోత్తరము పారాయణ చేస్తే ఎంతో మంచిది. ఈ రోజు ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:’ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి కుంకుమతో నిత్యం పూజ చేసే సువాసినులకు అమ్మవారు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.