వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

  • Publish Date - March 11, 2019 / 04:41 AM IST

కరీంనగర్ జిల్లాలో వేములవాడలో కొలువై ఉన్న శ్రీ రాజన్న స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ రోజు సోమవారం కావడం.. అంతేగాక ముందు రెండు రోజులు సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
* ఆలయ ప్రత్యేకత:
ఏ ఆలయంలోలేని ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామి వారికి మొక్కుకొని, పిల్లలు కలిగాక ఆ బాలునితో, ఒక దూడను తెచ్చి, ఆలయం చుట్టు తిప్పి ముందున్న స్థంబానికి కట్టి వెళతారు. దీన్నే కోడే మొక్కు అంటారు.  దూడను తెచ్చుకోలేని దూర ప్రాంతం వారి సౌకర్యార్థం ప్రస్తుతం ఇక్కడ ఆ సమయానికి కోడే దూడలను అద్దెలకు ఇస్తారు.