Navaratri 2023
Navaratri 2023 : శరన్నవరాత్రుల్లో భాగంగా నాల్గవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. మహాలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
Dussehra 2023 : దసరా అంటే అందరికీ సరదానే.. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా?
నవరాత్రుల్లో నాల్గవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఈరోజు అమ్మవారిని గులాబీరంగు చీరలో అలంకరిస్తారు. అమ్మవారికి తెల్లని కలువలతో పూజ చేస్తే ఎంతో మంచిది. క్షీరాన్నం, పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు దక్షిణ దానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సంతోషాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా నవరాత్రి వేళ శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో అమ్మవారిని అర్చించిన వారికి సంపద, హోదా కలుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మవారు మనిషిలోని కామ,క్రోధ లక్షణాలను పోగొట్టి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లోనే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు కూడా తామర పూవులతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. వెండి, బంగారం పూవులైతే మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారి ఎదుట లక్ష్మీ సహస్రం, శ్రీసూక్తం చదివితే మంచిది.
Bathukamma 2023: బృహదీశ్వరాలయానికి బతుకమ్మకు సంబంధమేంటి..?
‘యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవియే అని చండీ సప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రుల్లో శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి. ‘ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈరోజు లక్ష్మీ యంత్రాన్ని పూజించినా, లక్ష్మీ స్త్రోత్రాలు పఠించినా సత్ఫలితాలు ఉంటాయి.