TTD : జియో చేతికి ‘తిరుమల’ వెబ్‌సైట్

సాంకేతిక సమస్యలతో శ్రీవారి భక్తులకు చుక్కలు చూపించిన టీటీడీ వెబ్‌సైట్‌లో ఇప్పుడా సమస్యలు తీరాయి. టీటీడీకి సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరించేందుకు రిలయన్స్‌ అంగీకరించింది.

Ttd Jio

Jio And TTD : ఇన్నాళ్లు సాంకేతిక సమస్యలతో శ్రీవారి భక్తులకు చుక్కలు చూపించిన టీటీడీ వెబ్‌సైట్‌లో ఇప్పుడా సమస్యలు తీరాయి. టీటీడీకి సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరించేందుకు రిలయన్స్‌ అంగీకరించింది. దీంతో 2021, సెప్టెంబర్ 24వ తేదీ శుక్రవారం నుంచి జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై జియో మార్ట్‌ సర్వర్‌ ద్వారా టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ కానున్నాయి. టీటీడీకి ఈ సేవలను రిలయన్స్‌ ఉచితంగా అందిస్తోంది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా జియో డైరెక్టర్లతో మాట్లాడి ఒప్పించారు.

Read More : Tirumala Special Entry Darshan : అక్టోబర్ నెలకు రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

ఇప్పటివరకు టీసీఎస్‌ కంపెనీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరించింది. అయితే వెబ్‌సైట్‌ రద్దీని టీసీఎస్‌ సర్వర్లు తట్టుకోలేకపోవడంతో శ్రీవారి భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో రిలయన్స్ ను ఆశ్రయించింది టీటీడీ.మరోవైపు… తిరుమలలో భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లను ఇచ్చే శ్రీనివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. టోకెన్ల కోసం భక్తులు బారులు తీరారు. అయితే టిక్కెట్లు అయిపోయాయని అధికారులు చెప్పడంతో  జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు టిక్కెట్లు ఇవ్వాలంటూ భక్తులు నినాదాలు చేశారు.  భక్తులను అదుపుచేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.

Read More : Tirumala Sarva Darshanam : సర్వదర్శనం టోకెన్ల కోసం శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

శుక్రవారంతో తిరుమలలో ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల పంపిణీ నిలిచిపోనుంది. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు ఇవ్వనున్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత సెప్టెంబరు 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్ ఉండాలి లేదా మూడు రోజుల ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ పేర్కోంది.