×
Ad

Karthika Purnima : అష్టదరిద్రాలు పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేయండి.. అద్భుత ఫలితాలు లభిస్తాయి..

Karthika Purnima కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పుకుంటే చాలా ఉంది. కార్తీక పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతాలు, నోములు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.

Karthika Purnima

Karthika Purnima : కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. ఈ కార్తీక మాసం శివుడు విష్ణువుకు ఇష్టమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో స్నానాలు, దానాలు, జపాలు, ఉపవాసాలు, దీపారాధన వంటివి చేస్తుంటారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పుకుంటే చాలా ఉంది. బుధవారం కార్తీక పౌర్ణమిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, కార్తీక పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతాలు, నోములు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానాలకు ఎంతో పవిత్రత ఉంది.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటిస్తే జన్మజన్మల దారిద్ర్యం తొలగిపోతుంది.. విశేష ధన లాభం చేకూరుతుంది.. అప్పుల సమస్యల నుంచి ఎలా బయటపడొచ్చు.. కుటుంబ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో.. ఇక్కడ తెలుసుకుందాం.

♦ కార్తీక పౌర్ణమి రోజు అందరూ సూర్యోదయానికి ముందే చన్నీళ్లతో లేదా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.
♦ ఒకవేళ సూర్యోదయానికి ముందు స్నానం చేయలేకపోయిన వారు కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే సమయంలో గంగా, యమునా, సరస్వతీ అని మూడుమూడు సార్లు అనుకుంటూ స్నానం చేయాలి. ఆ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.
♦ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా ఆవు పాలతో శివాభిషేకం చేసినట్లయితే జీవితంలో వారికి బంగారానికి, వెండికి లోటు ఉండదు. కావాల్సినంత బంగారం, వెండి కొనుక్కొనే యోగం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఆవు పాలతో శివ లింగానికి అభిషేకం చేయాలి.
♦ కార్తీక పౌర్ణమి రోజు శివుడిని, లక్ష్మీ దేవిని మారేడు దళాలతో పూజిస్తే జన్మజన్మల దారిద్ర భాగాలన్నీ తొలగిపోతాయి.
♦ కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా గొడవులు ఉన్నవాళ్లు కార్తీక పౌర్ణమి రోజు ఆవుపాలతో చేసిన పాయసం లక్ష్మీనారాయణలకు (ఇంట్లో పటాల ముందు లేదా దేవాలయాల్లో) నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించడం.. ఇతరులకు పంచిపెట్టడం ద్వారా కుటుంబ కలహాలు దూరమవుతాయి.
♦ అష్టదరిద్రాలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగిపోవడంతోపాటు తొందరలోనే గృహయోగం కలుగుతుంది.

వీటిని దానం చేస్తే అద్భుత ఫలితాలు..
♦ ఒక అరటి ఆకులో ఆవు పాల ప్యాకెట్, ఆవు పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్ ఉంచి ఎక్కడైనా దేవాలయంలో అయ్యగారికి దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూరుతాయి.
♦ కార్తీక పౌర్ణమి రోజు అన్నదానం చేయాలి. ఇలా చేయడం ఎంతో మేలు జరుగుతుంది.
♦ కుబేరుడి దగ్గర నవనిధులు మనం దానం చేసిన ఫలితం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి.. మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి శివాలయంలో దీప దానం చేస్తే కుబేరుడి దగ్గర ఉన్న నవ నిధులు మీకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ దీప దానం వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితంకూడా లభిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో తెలిపారు.
♦ కార్తీక పౌర్ణమి నాడు వస్త్రదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అలాగే పేదవారికి, లేని వారికి ఆహారాన్ని దానం చేయడం ఎంతో విశేష ఫలితాలను ఇస్తుంది.
♦ కార్తీక పౌర్ణమి నాడు బెల్లాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ విశేషమైన రోజున తులసి, రావి చెట్ల ముందు దీపదానం చేస్తే సంతోషం, శ్రేయస్సు, శాంతి కలుగుతాయి.