UP : కాశీ విశ్వనాథుని కారిడార్ పనులు పూర్తి ఎప్పుడంటే

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ‘కాశీ విశ్వనాథ్’ ఆలయ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే...ఈ కారిడార్ ను నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులకు 2019, మార్చి 08వ తేదీన పీఎం మోదీ శంకుస్థాపన చేశారు.

Kashi Vishwanath : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ‘కాశీ విశ్వనాథ్’ ఆలయ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే…ఈ కారిడార్ ను నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులకు 2019, మార్చి 08వ తేదీన పీఎం మోదీ శంకుస్థాపన చేశారు.

Read More : Petrol Diesel Price : ఏ నగరంలో పెట్రోల్ రేటు ఎంత?

ఆలయ విస్తరీకరణ, సౌందర్యీకరణ పేరిట ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధాని మోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆలయ సుందరీకరణ తర్వాత..కాశీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

Read More : German village: నీరజ్ చోప్రా విజయం.. జర్మన్ గ్రామంలో సెలబ్రేషన్స్

కారిడార్ లోని ప్రధాన మార్గాలు, గంగా ఘాట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. కాశీ విశ్వనాథుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. అలాగే భక్తులు సేద తీరేందుకు చక్కటి వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు.

Read More : Nizamabad : మొక్క రైతుకు మంచిరోజులు

కాశీ విశ్వనాథుని ఆలయ సుందీరకరణ పనులు సుమారు 60 శాతానికి పైగా పూర్తయ్యాయని ఆలయ అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్న అధికారి సునీల్ వర్మ వెల్లడించారు. ఇక ఆలయ సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మాణం అవుతున్నాయని, 24 భవన సముదాయాలతో నిర్మితమౌతున్న కారిడార్ ప్రాజెక్టుకు రూ. 339 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కారిడార్ పనులన్నీ నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు