Nizamabad : మొక్క రైతుకు మంచిరోజులు

ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుకు ఎప్పుడూ మిగిలేది కన్నీరే. సకాలంలో వర్షాలు రాక పంటలు పండకపోవడం, ఒకవేళ పండినా, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడం... దీంతో రైతు అప్పులు పాలు కావడం.. సర్వసాధారణంగా మారింది. కానీ, ఈ సారి మొక్కజొన్నను పండించిన నిజామాబాద్ జిల్లా రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Nizamabad : మొక్క రైతుకు మంచిరోజులు

Corn

Corn Farmers : ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుకు ఎప్పుడూ మిగిలేది కన్నీరే. సకాలంలో వర్షాలు రాక పంటలు పండకపోవడం, ఒకవేళ పండినా, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడం… దీంతో రైతు అప్పులు పాలు కావడం.. సర్వసాధారణంగా మారింది. కానీ, ఈ సారి మొక్కజొన్నను పండించిన నిజామాబాద్ జిల్లా రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడున్నర నెలలపాటు జరిగే క్రయ విక్రయాలు ప్రారంభం కావడంతో అంకాపూర్ మార్కెట్ పచ్చి మొక్కబుట్టలతో కళకళ లాడుతోంది.

Read More : August 15 : ఢిల్లీలో హై అలర్ట్, నలుగురు తీవ్రవాదులు అరెస్టు!

వ‌ర్షాకాలం ఆరుత‌డి పంటల్లో ముందుగా కొత‌కు వ‌చ్చేది మొక్క‌జొన్న ప‌చ్చి బుట్ట‌.  త‌క్కువ పెట్టుబ‌డి.. స్వ‌ల్ప కాలంలో చేతికి వ‌చ్చే ఈ పంట ద్వారా రైతులు ల‌భాలు గ‌డిస్తున్నారు.. ఈ యేడు క‌రోనా ప్రభావం ఉంటుందేమోనని నిజామాబాద్ జిల్లాలోని రైతులు పంట సాగును త‌గ్గించారు. అయితే పంట వేసిన రైతులకు మాత్రం మార్కెట్ లో భారీ డిమాండ్ వచ్చింది.

Read More : India : వినేశ్ ఫొగాట్ షాకింగ్ స్టేట్‌మెంట్‌

అంకాపూర్. ఈ పేరు చెబితే .. దేశీ చికెన్.. వేడివేడి మొక్క వడలు.. కాల్చి అమ్మే కంకులు.. ఠక్కున గుర్తొస్తాయి. అంతే కాదు ప్రతి ఏటా ఈ సీజన్లో ఇక్కడ పచ్చి మొక్క బుట్టల వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. ఏటా 50 కోట్లకు పైగా పచ్చిబుట్టల వ్యాపారం జరుగుతోంది. వివిధ జిల్లాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న ప‌చ్చి బుట్ట ఆటో ట్రాలి ధ‌ర రూ. 6,500 ప‌లుకుతోంది.

Read More : EC : వెబ్ సైట్ హ్యాక్, 10 వేలకు పైగా ఫేక్ ఓటర్ ఐడీల తయారీ

గ‌త యేడు రూ. 3,500 నుండి 4 వేలు పలికేది. ఇప్పుడు రూ.6,500 నుంచి 7 వేల వ‌ర‌కు ప‌లుకుతోంది. గత ఏడాదితో పోల్చితే, ఈ సంవత్సరం మొక్కజొన్న రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. సీజన్లో ప్రత్య‌క్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. ఆర్మూర్ డివిజ‌న్ లో మొక్క‌జోన్న పంట‌ను ఎక్కువ‌ సాగుచేస్తారు. గత ఏడాది 36 వేల ఎక‌రాల్లో సాగు చేశారు. క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా మొక్క‌జొన్న పంట‌ సాగును రైతులు త‌గ్గించారు. దీంతో మొక్క‌జొన్న పచ్చి బుట్టకు డిమాండ్ పెరిగింది.

Read More : Rihanna: ఫోర్బ్స్‌లో రిహన్నా.. రిచెస్ట్‌ లేడీ మ్యూజీషియన్‌‌గా రికార్డ్!

జూలై నుంచి అక్టోబర్ మూడో వారం వరకు దాదాపు మూడున్నర నెలల పాటు అంకాపూర్ మార్కెట్ నుంచే మొక్క బుట్ట విక్రయాలు కొనసాగుతాయి. పరిసర గ్రామాల్లో పండించిన మొక్కజొన్నను ఇక్కడికి తెస్తారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికొచ్చి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. లారీలు, వ్యాన్లలో తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో వీటి విక్రయిస్తారు. గ‌త యేడాదితో పోల్చితే ఈ యేడు మొక్క‌జొన్న సాగుచేసిన రైతులు లాభాలు పొందుతున్నారు. పదమూడు వందల పైచిలుకు కంకులు ఉండే ఆటో ట్రాలీకి రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ప‌లుకుతుంది. రైతులకు ప్రస్తుతం ఒక బుట్ట 7 రూపాయల వరకు ప‌డుతుంది.. వ్యాపారులు పదికి విక్రయిస్తున్నారు.. కాల్చిన వాటిని 15 రూపాయ‌ల‌కు విక్రయిస్తున్నారు.