EC : వెబ్ సైట్ హ్యాక్, 10 వేలకు పైగా ఫేక్ ఓటర్ ఐడీల తయారీ

ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ చేశాడని అధికారులు తెలుసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాక్ చేసింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాసిగా గుర్తించారు.

EC : వెబ్ సైట్ హ్యాక్, 10 వేలకు పైగా ఫేక్ ఓటర్ ఐడీల తయారీ

Voter Ec

Hacking’ Website : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారికి తెలియకుండానే బ్యాంకులో ఖాతా ఖాళీ కావడం, ఏదో గిఫ్ట్ వచ్చిందని..లింక్ పంపించడం..ఇతరత్రా కొత్త పద్ధతుల ద్వారా మోసగిస్తున్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీలు, ప్రముఖుల వరకు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఇలాగే…హ్యాకర్లు కూడా రెచ్చిపోతున్నారు. సంస్థలు, ఇతరత్రా కంపెనీలకు సంబంధించిన డేటాను తస్కరిస్తున్నారు. దీంతో వినియోగదారులు, కస్టమర్ల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తమౌతోంది. హ్యాకర్లు ఎంత రెచ్చిపోయారంటే…భారత ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.

ఎన్నికల కమిషన్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు, ఓటర్ల జాబితా..ఇతరత్రా కీలక సమాచారం ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే..ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ చేశాడని అధికారులు తెలుసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాక్ చేసింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాసిగా గుర్తించారు. వెంటనే విపుల్ సైని (24) అదుపులోకి తీసుకున్నారు. హ్యాక్ చేసి..దాదాపు పది వేలకు పైగా ఫేక్ ఓటర్ ఐడీలను తయారు చేసినట్లు గుర్తించారు.

ఇతను బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA)..డిగ్రీ కలిగిన ఇతను మూడు నెలల్లో 10 వేల ఫేక్ ఐడీలను క్రియేట్ చేశారని తేలింది. అసలు ఇలా ఎందుకు చేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి ఈ పనులు చేయించినట్లు తెలుసుకున్నారు. ఒక్కో ఐడీ కార్డుకు రూ. 100 నుంచి రూ. 200 చొప్పున విపుల్ తీసుకున్నాడని, అతని బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 60 లక్షలను సీజ్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.