Ravichandran Ashwin : బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకున్న అశ్విన్.. అరంగ్రేటం చేయకుండానే.. ఎందుకో తెలుసా?
రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్‌బాష్ లీగ్ (Ravichandran Ashwin) 2025-26 సీజన్ నుంచి తప్పుకున్నాడు.
                            Ravichandran Ashwin ruled out of Big Bash League 15
Ravichandran Ashwin : టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో బిగ్‌బాష్ లీగ్‌లో అశ్విన్ అరంగ్రేటం చూసేందుకు కోసం మరికొన్నాళ్లు ఆగక తప్పదు.
క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న రవిచంద్రన్ విదేశీ లీగులపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడు సిడ్నీ థండర్ ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే.. బిగ్‌బాష్ సీజన్ 15 ఆరంభానికి ముందే అశ్విన్ ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు.
బిగ్‌బాస్ సీజన్ 15ను మిస్ అవుతున్నందుకు తాను ఎంతో బాధపడుతున్నట్లు అశ్విన్ తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా కోలుకోవడంపైనే ఉందన్నాడు. త్వరలోనే బలంగా తిరిగి వస్తానని చెప్పాడు. థండర్ కుటుంబం, ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ఆప్యాయతకు ధన్యవాదాలు తెలియజేశాడు. థండర్ జట్లు రాణించాలని ఆకాంక్షించాడు.
మరోవైపు థండర్ యాజమాన్యం సైతం అశ్విన్ గాయంపై స్పందించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. సీజన్ మొత్తానికి దూరం అవడం దురదృష్టకరమని అంది.
A letter from Ash💚 pic.twitter.com/mQqjpUYS9O
— Sydney Thunder (@ThunderBBL) November 4, 2025
థండర్ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోప్లాండ్ మాట్లాడుతూ.. అశ్విన్ మోకాలి గాయం గురించి తెలిసిన తరువాత థండర్‌లోని ప్రతి ఒక్కరు నిరాశకు గురి అయినట్లు తెలిపారు. అతడి అరంగ్రేటానికి గ్రాండ్ గా ప్లాన్ చేశామన్నాడు. అయితే.. అది వాయిదా పడిందన్నారు. అతడితో మొదటిసారిగా మాట్లాడినప్పటికి నుంచి థండర్ పట్ల అతడు నిబద్ధతతో ఉన్నాడన్నాడు. అతడు దీర్ఘకాలం థండర్ జట్టులో భాగం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Rising Stars Asia Cup 2025 : కెప్టెన్‌గా జితేశ్ శర్మ.. వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యకి చోటు..
బిగ్‌బాష్ లీగ్ 15 సీజన్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. సిడ్నీ థండర్ తమ తొలి మ్యాచ్‌ను డిసెంబర్ 16న హోబర్ట్ హరికేన్స్‌తో ఆడనుంది.
బీబీఎల్ 15వ సీజన్‌లో సిడ్నీ థండర్ జట్టు ఇదే..
వెస్ అగర్, టామ్ ఆండ్రూస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్, ఓలీ డేవిస్, లోకీ ఫెర్గూసన్, మాథ్యూ గిల్క్స్, క్రిస్ గ్రీన్, ర్యాన్ హాడ్లీ, షాదాబ్ ఖాన్, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌ఆండ్రూ, బ్లేక్ నికితారాస్, డేవిడ్, అడియన్ ఓకానర్, డేనియల్ సామ్స్, తన్వీర్ సంఘా, డేవిడ్ వార్నర్
