Komuravelli : కొమురవెల్లి మల్లన్న కళ్యాణం..వారికి మాత్రమే అనుమతి

కరోనా...కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతినివ్వనున్నారు.

Komura

Komuravelli Mallanna Kalyanam : కొమురవెల్లి మల్లన్న కళ్యాణోత్సవానికి ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లిఖార్జునుడు పెళ్లాడనున్నారు. ఈ కళ్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించనున్నారు. తోటబావి వద్ద కళ్యాణం జరుగనుంది. ఇప్పటికే వీరవైశ పీఠాధిపతి కొమురవెల్లికి చేరుకున్నారు. 2021, డిసెంబర్ 26వ తేదీ ఆదివారం నుంచి మూడు నెలల జాతరకు అంకుర్పారణ చేయనున్నారు. అయితే..ప్రస్తుతం కరోనా…కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతినివ్వనున్నారు.

Read More : Suicide Bomber : క్రిస్మస్ వేళ మారణహోమం.. ఆత్మహుతి దాడిలో 6గురు మృతి

మరోవైపు….కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా…ఆదివారం తెల్లవారుజామున దిష్టి కుంభం కార్యక్రమం నిర్వహించారు. వీరశైవ ఆగమ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. 200 కిలోల అన్నం వండి..ఆలయ మహా మండపంలో రాశిగా పోశారు. అనంతరం దిష్టి కుంభం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, బార్శీ బృహన్మఠాధీశులు సిద్ధగురు మణికంఠ శివా చార్యులు పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు కొమురవెల్లి మల్లన్న రథోత్సవం, 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు లక్షబిల్వార్చన జరుగనుంది.