Khammam : లోక కల్యాణం కోసం.. సాధువుల సాష్టాంగ నమస్కార పాదయాత్ర

Saints Yatra : ప్రతీరోజూ అర్థరాత్రి 1గంట నుంచి ఉదయం 7గంటల వరకు యాత్ర కొనసాగిస్తారు. ఇలా ఇప్పటివరకు 4వేల కిలోమీటర్ల మేర పయనించారు.

Saints Yatra : లోక కల్యాణం కోసం ముగ్గురు సాధువులు చేపట్టిన సాష్టాంగ నమస్కార యాత్ర ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు సాధువులు గతేడాది జూన్ 29న ఉత్తరాఖండ్ లోని గంగోత్రి నుంచి యాత్రను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ కు చెందిన మౌనీబాబా, దామోదర్ దాస్, దాస్ సాష్టాంగ నమస్కార యాత్రను చేస్తున్నారు.

వీరికి మరో ఇద్దరు సాధువులు సహాయకులుగా ఉన్నారు. ప్రతీరోజూ అర్థరాత్రి 1గంట నుంచి ఉదయం 7గంటల వరకు యాత్ర కొనసాగిస్తారు. వీరి వెంట ఉన్న వాహనంలోనే భోజన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ధర్మాకోల్ షీట్ లాంటి దుప్పటిని రోడ్డుపై పరిచి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Also Read..Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం.. భక్తులకు శుభవార్త, ఆలయ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్

ఇలా ఇప్పటివరకు 4వేల కిలోమీటర్ల మేర పయనించారు. వచ్చే ఏడాది జూన్ లో తమిళనాడు రామేశ్వరంలో శివుడికి అభిషేకంతో యాత్ర ముగుస్తుందని చెప్పారు సాధువులు.

ట్రెండింగ్ వార్తలు