Madurai Meenakshi Temple 108 womens Veena
Madurai Meenakshi Temple 108 womens Veena : శరన్నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా అంగం రంగ వైభోగంగా జరిగాయి. ఈ వేడుకల్లో దుర్గామాతను ఎంతోమంది భక్తులు దర్శించుకున్నారు. ఎన్నో రకాలుగా అమ్మవారిని కీర్తించారు. దీంట్లో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో విజయదశమి సందర్భంగా 108 మంది మహిళలు వీణ వాయించారు. కర్ణాటక సంగీతాన్ని వీణ ద్వారా వీనుల విందుగా వాయించి ఆకట్టుకున్నారు. కచేరీ హాలులో 108మంది మహిళలు దుర్గామాత కీర్తనలను వీణలపై వాయించారు. వీణానాదానికి వీక్షకులంతా పరవశించిపోయారు.
నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఈ ఆనందకర ఘట్టాలను పలువురు తిలకించారు. 108మంది మహిళలు వీణానాదంతో స్వరనీరాజనం పలికారు. వీణానాదాలతో ఆలయ ప్రాంగణం అంతా పులకించిపోయింది. సంగీతంతో ఆలయం ఆహ్లాదంగా మారిపోయింది. 108మంది మహిళలు అమ్మవారి ఆలయంలో ఒకేచోట వీణ వాయించే దృశ్యం చాలా ఆనందంగా ఉందని వీక్షలు సంతోషాన్ని వ్యక్తంచేశారు.
#WATCH | Tamil Nadu: Around 108 women Veena artists performed at Meenakshi Amman Temple in Madurai. (24.10) pic.twitter.com/DkKVQTgVww
— ANI (@ANI) October 24, 2023