No Permission For Girivalam : అరుణాచలం గిరి ప్రదక్షిణకు అనుమతి లేదు

తమిళనాడు లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై(అరుణాచలం)లో ప్రతి నెలా పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణకు అక్టోబరు నెలలో కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

No Permission For Girivalam :  తమిళనాడు లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై(అరుణాచలం)లో ప్రతి నెలా పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణకు అక్టోబరు నెలలో కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అక్టోబర్ 19-21 తేదీల మధ్య గిరిప్రదక్షిణ మార్గాన్ని మూసివేస్తున్నట్లు…. భక్తులను ఆ మార్గంలోకి అనుమతించమని జిల్లా కలెక్టర్ బి. మురుగేశ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

తిరువణ్ణామలై(అరుణాచలం)లో ప్రతి నెల వచ్చే పౌర్ణమికి తమిళనాడునుంచే కాకా కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చికాలి నడకన గిరి ప్రదక్షిణ చేస్తారు. కోవిడ్-19 నివారణలో భాగంగా అక్టోబర్ నెలలో కూడా 19,20,21 పౌర్ణమి తేదీల్లో భక్తులను గిరి ప్రదక్షిణ మార్గంలోకి అనుమతించేదిలేదని కలెక్టర్ తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు