Simhachalam : సింహాద్రి అప్పన్న ఆలయంలో పోలి పాడ్యమి వేడుకలు.. మహిళా భక్తులతో కిటకిటలాడిన వరాహ పుష్కరిణి..

సింహాచలం పుణ్యక్షేత్రమైన సింహాద్రి అప్పన్న ఆలయంలో పోలి పాడ్యమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా భక్తులతో..కార్తీక శోభతో వరాహ పుష్కరిణి వెలిగిపోయింది.

Polipadyami Festival At Simhachalam Appanna Temple

Polipadyami Festival : విశాఖపట్నం సమీపంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో పోలి పాడ్యమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్తీకమాసం చివరి రోజు పోలి పాడ్యమి కావటంతో మహిళలు భారీగా తరలివచ్చారు. వరాహ పుష్కరిణికి మహిళలు భారీగా తరలివచ్చి అరటి డొప్పలలో కార్తీక దీపాలు వదిలారు. తెల్లవారుజామునుంచే మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పోలి పాడ్యమి వేడుకలను కార్తీక దీపాల ద్వారా నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు కావటంతో పోలి స్వర్గానికి వెళ్లే ఈ వేడుకను అత్యంత ఘనంగా మహిళలు దీపాల వెలిగించి పోలిని గుర్తు చేసుకున్నారు. పోలికి ఇచ్చిన స్వర్గారోహణ తమకు కూడా దక్కాలని వేడుకున్నారు.

Also Read : Karthika Masam 2023 : భక్తి ఉంటే ముక్తి లభిస్తుందని చెప్పిన ‘ పోలి స్వర్గం ’ కథ ..

విశాఖ పట్టణానికి అతి సమీపంలో వున్న పుణ్య క్షేత్రం సింహాచలం. రత్నగిరిపై సింహాచల క్షేత్రంలో ప్రసిద్ధమైన వరాహ నరసింహ స్వామి దేవాలయం ఉంది. దీనినే సింహాద్రి అప్పన్న కొండ అంటారు. తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి దాదాపు 250 మీటర్ల ఎత్తున ఉన్న సింహగిరి అనే పర్వతం మీద కొలువై ఉన్న విష్ణుస్వరూపం వరాహానరహింహ స్వామిగా పూజలందుకుంటున్నారు. ఈ స్వామిని అందరు ఎంతో భక్తిగా అప్పన్న అని పిలుచుకుంటారు. కార్తీక మాసం చివరి రోజున స్వామి వారి కొండపై పోలి పాడ్యమి వేడుకల్ని నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ముఖ్యంగా మహిళా భక్తులు వరాహ పుష్కరిణిలో కార్తీక దీపాలు వదిలి పోలి పాడ్యమి పూజలు నిర్వహిస్తుంటారు.