Karthika Masam 2023 : భక్తి ఉంటే ముక్తి లభిస్తుందని చెప్పిన ‘ పోలి స్వర్గం ’ కథ ..

మనస్సులో భక్తి ఉండాలే గానీ ఎన్ని ఆంక్షలు ఉన్నా గుప్పెడంత భక్తితో స్వర్గ ప్రాప్తి లభిస్తుందని తెలియజేసిన కథే ‘పోలి స్వర్గం’ కథ..

Karthika Masam 2023 : భక్తి ఉంటే ముక్తి లభిస్తుందని చెప్పిన ‘ పోలి స్వర్గం ’ కథ ..

Karthika Masam poli swargam

Karthika Masam poli swargam : కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం. కార్తీక మాసం వచ్చిందంటే నోములు, వ్రతాలు, తెల్లవారు జామున దీపాలు. ఇలా నెల అంతా ఆధ్మాత్మిక భావన కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమితో పాటు మాసం చివరిలో వచ్చే ‘పోలి స్వర్గం’ వెనుక పురాణాల్లో చాలా ఆసక్తికర కథనం ఉంది. పోలి అంటే ఎవరు..?ఆమెకు స్వర్గానికి ఉన్న సంబందమేంటి..భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది..పూజల్లో ఉండాల్సింది చిత్తశుద్దే తప్ప ఆడంబరాలకు చోటు లేదు అని పోలి నిరూపించిన కథనమే ‘పోలి స్వర్గం’ వెనుక ఉన్న వాస్తవం..

కార్తీకమాసం అంటే దీపాలే గుర్తుకొస్తాయి. ఏ ఇంట చూసినా..ఏ దేవాలయం కూడా దీపాలతో వెలిగిపోతుంటాయి. ఈ కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతనే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనంగా కనిపించే పోలి స్వర్గం కధ చాలా ప్రాచుర్యం చెందింది. మనస్సులో భక్తి ఉండాలే గానీ ఎన్ని ఆంక్షలు ఉన్నా గుప్పెడంత భక్తితో స్వర్గ ప్రాప్తి లభిస్తుందని తెలియజేసిన కథే ‘పోలి స్వర్గం’ కథ..ఇక ఈ కథ విషయానికొస్తే..

పూర్వం రోజుల్లో అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అటువంటి ఓకుటుంబంలోని కోడలు పేరు ‘పోలి’. కృష్ణాతీరంలో నివసించే ఓ కుటుంబంలో ఆఖరి కోడలు పేరు ‘పోలి’. ఆ కుటుంబంలో అత్తా మామ, ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్లు ఉండేవారు. ఆ ఐదుగురు కోడళ్లలో ఆఖరి కోడలు పోలి అంటే అత్తకు ఏమాత్రం ఇష్టముండేది కాదు. నలుగురు కోడళ్లను బాగా చూసుకునే అత్తగారు ఐదో కోడలు పోలిని మాత్రం సరిగా చూసేది కాదు.ఎప్పుడు సాధింపులు..వేధింపులు చేస్తుండేది. ఇంటి చాకిరి అంతా ఆమెమీదనే పడేసేవారు. పోలి అంటే అత్తగారికి ఎందుకు ఇష్టం ఉండేది కాదంటే..ఆమెకు చిన్నప్పటినుంచి పూజలు అంటే ఇష్టం. అత్తింటికి వచ్చినా పూజలు చేసుకునేది. కానీ అది అత్తకు ఇష్టముండేది కాదు. కారణం తానే పెద్ద భక్తురాలు..తానే పూజలు చేయాలి అనుకునేది. అలా పూజలు చేసే కోడలు పోలి అంటే ఇష్టముండేది కాదు. కానీ అత్తగారికి చాటుగా పోలి తన పూజల్ని భక్తి శ్రద్ధలతో చేసుకునేది. తనకు అందుబాటులో ఉండే పదార్ధాలతోనే పూజలు చేసుకునేది. కార్తీక మాసంలో దీపం పెట్టుకునే అవకాశం కూడా లేకుండా అత్త పోలికి ఏమి అందనిచ్చేది కాదు. దీపం పెట్టుకునేందుక నెయ్యి, నూనె, వత్తులు వంటివి కూడా అందుబాటులో లేకుండా చేసేది.

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరి దీపం .. నవగ్రహ దోషాల హరణం

కానీ..కార్తీకమాసంలో చిన్నకోడలిని ఇంట్లోనే ఉండమని.. పెద్ద నలుగురు కోడళ్లను తీసుకుని కృష్ణానదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది. కానీ పోలికి ఏమీ అందుబాటులో లేకుండా చూసి మరీ వెళ్లేది. కానీ పోలి మాత్రం పెరట్లో ఉండే పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి..తెల్లవారు జామునే మజ్జిగ చేసిన చల్ల కవ్వానికి ఉన్న వెన్నతో తులసి కోట ముందు దీపం వెలిగించుకునేది. నదికి వెళ్లిన అత్త తిరిగి వచ్చేసరికి దీపం పెట్టటం పూర్తి చేసుకుని ఆ దీపం అత్తకు కనిపించకుండా దాన్ని ఓ మేదరబుట్ట కింద దాచిపెట్టేంది.

ఇలా కార్తీకమాసం అంతా అత్తా, తోటి కోడళ్లు నదీ స్నానానికి వెళ్లాక తన పూజా కార్యక్రమాలు అలా చేసుకునేది. అలా కార్తీకమాసం చివరి రోజు మార్గశిర అమావాస్య రోజు వచ్చింది. కార్తీకం చివరి రోజున కూడా అత్తా కోడళ్లు నదీ స్నానానికి వెళ్లారు. పట్టు చీరలు కట్టుకుని దర్పంగా వెళ్లారు. కానీ పోలికి ప్రతీ రోజులాగనే ఎటువంటి అందుబాటులో లేకుండా చూసుకుని మరీ వెళ్లింది. పైగా తామంతా ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు చేయాలని ఇంటిపనులతో పాటు పోలి దీపం వెలిగించుకునే తీరిక కూడా లేకుండా చేయటానికి రోజు కంటే ఎక్కువ పనులు కూడా అప్పగించి మరీ వెళ్లింది.

కానీ పోలి మాత్రం మనస్సు నిండా భక్తి భావంతో ప్రతీ రోజులాగానే వెలుగు రాకుండానే ఇంటిపనులు చకచకా పూర్తి చేసేసుకుని పెరటిలోఉన్న బావి వద్ద స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగించింది. అలాప్రతీ రోజు పోలి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించే పోలి భక్తికి దేవతలంతా చూసి ముచ్చటపడ్డారు. అహా భక్తి తప్ప దర్పం లేని ఈ భక్తురాలు నిజంగా ధన్యురాలు అని దీవించారు. ఆమె భక్తికి సంతసించిన ముక్కోటి దేవతలు ఆమెకు బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పవిమానాన్ని పంపారు. స్వర్గం నుంచి దిగి వచ్చిన పుష్పక విమానాన్ని చూసి పోలి మురిసిపోయింది. భక్తితో ఆ శివకేశవులకు దణ్ణం పెట్టుకుని విమానం ఎక్కేసింది. అలా వేయి కాంతుల వెలుగులో పుష్పక విమానాన్ని చూసిన ఆమె అత్తా..తోటి కోడళ్లు ఆశ్చర్యపోయారు. తమకోసమే వచ్చిందని చూసి మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండటం చూసి ఆశ్చర్చపోయారు.

Rajasthan : 350 ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న ఆ దేవుడి ప్రసాదం .. దీని వెనుక ఆసక్తికర కారణం..

ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆశతో వారంతా పోలి కాళ్లు పట్టుకుని వేలాడారు. కానీ వారు చేసే పూజల్లో భక్తి లేదు. చిత్తశుద్ధి లేదు..కేవలం దర్పం, ఆర్బాటం మాత్రమే ఉంది. అందుకే వారికి స్వర్గప్రాప్లి లభించలేదు. అదే విషయాన్ని దేవతలు వారికి తెలియజేశారు. పోలికి ఉన్న నిష్కల్మషమైన మనసు..భక్తి వల్లే స్వర్గప్రాప్తి లభించిందని మీకు ఆ అర్హద లేదని తేల్చి చెప్పారు. పోలిని స్వర్గానికి తీసుకెళ్లిపోయారు.

అలా పోలి భక్తి ఉంటే ముక్తి లభిస్తుందని నిరూపించిన కథలే పోలి స్వర్గం కథ. అలా కార్తీకమాసం చివరి రోజు అంటే అమావాస్య రోజు మహిళలంతా పోలిని తల్చుకుంటూ వేకువజామునే అరటిదొప్పలలో దీపాలు వెలిగించి పూజలు చేసి నీటిలో వదులుతారు.అలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తల్చుకుంటారు. ఆమెకు కూడా మనస్సులో నమస్సులు అర్పిస్తారు.