Srikakulam : రథసప్తమి ఉత్సవాలు.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం

రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్‌ను మూడు రూట్లుగా విభజించారు.

Rathasaptami

Ratha Saptami 2022 : తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. అర్ధరాత్రి తరువాత రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈసారి కోవిడ్ ఆంక్షల మధ్యే రథ సప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పన చేయనున్నారు. ముందుగా వేదపారాయణతో ఆదిత్యుని మూలవిరాట్టుకు క్షీరాభిషేకం నిర్వహించి త్రిచ, సౌరం, అరుణం, నమకం, చమకాలతో అభిషేకం నిర్వహించనున్నారు వేదపండితులు.

Read More : AP Kodi pandalu : జనాలమీదకు దూసుకొచ్చి..వ్యక్తి ప్రాణాలు తీసిన పందెం కోడి

అనంతరం నదీజలాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి సుప్రభాతం, నిత్యార్ఛన,ద్వాదశి అర్చనలతో స్వామివారికి ప్రత్యేక సేవలు చేస్తారు. 2022, ఫిబ్రవరి 08వ తేదీ మంగళవారం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం సాక్షాత్కరించనుంది. అనంతరం పుష్పాలంకరణ సేవ నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి ఏకాంత సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. రథ సప్తమి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వేడుకలకు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Read More : Pawan Kalyan : సమతామూర్తి సన్నిధిలో పవన్ కళ్యాణ్

కోవిడ్ నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్స్ , థర్మల్ స్కాన్ , శానిటైజర్ లు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. 32 సిసి కేమెరాలతో ఆర్డివో, డిఏస్పి ఆద్వర్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్‌ను మూడు రూట్లుగా విభజించారు. నరసన్న పేట నుంచి వచ్చే భక్తులు రామలక్ష్మణ జంక్షన్ నుంచి సంతోషి మాత టెంపుల్ మీదుగా రావాలిని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. నవభారరత్ నుంచి వచ్చే వారు ఏడు రోడ్ల జంక్షన్ మీదుగా, గార వైపు నుంచి వచ్చే వాహనాలును రెడ్డి పేట వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ పోలీసులు.