Srisailam : శివోహం, భక్తులకు సర్వదర్శనాలు

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. . భక్తులు..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..స్వామి వారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు.

Sarva Darshan : శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సర్వదర్శనాలు కల్పించనున్నారు. 2021, ఆగస్టు 18వ తేదీ బుధవారం నుంచి భక్తులు..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..స్వామి వారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడతలుగా ఉంటాయని, ఉదయం 7 గంటలకు తొలి విడుత, మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత, రాత్రి 7.30 గంటలకు మూడో విడత బ్రేక్ దర్శనాలకు అనుమతినిస్తామన్నారు.

Read More : Dalitha Girijana Dandora sabha : రావిరాలలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నేడే

బ్రేక్ దర్శనం టికట్ రూ.500 ఉంటుందన్నారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని దేవస్థానం స్పష్టం చేసింది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం తప్పక పాటించాలని వెల్లడించింది. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందన్నారు.
గర్భాలయ అభిషేకాలను ఏడు విడతలుగా..సామూహిక అభిషేకాలు నాలుగు విడతులుగా కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక అభిషేకంతో పాటు..దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ..ఆన్ లైన్, కరెంటు బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Read More : Dry FruitsPrices:తాలిబాన్ల చెరలోఅఫ్గాన్..ఇండియాలో పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు

ఆర్జిత కుంకుమార్చన, వృద్ధ మల్లిఖార్జున స్వామి, సవావరణ అర్చన..పరిమిత సంఖ్యలో కొనసాగుతాయన్నారు. వేద ఆశీర్వచనం కూడా పున:ప్రారంభమౌతుందని, రోజులకు నాలుగు విడతులగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇక ఉచిత ప్రసాదం నిరంతరం కొనసాగుతుందని, వేకువ జామున దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి…రాత్రి అమ్మవార్ల ఏకాంత సేవ ముగిసే వరకు భక్తులకు ఉచిత ప్రసాదం అందచేస్తామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు