Vijayawada Kanaka Durgamma
Vijayawada: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కనకదుర్గ అమ్మవారు కూరగాయలు, పండ్లు రూపంలో శాకాంబరీ దేవిగా దర్శనమిస్తారు. దీంతో శాంకాబరీదేవి అవతారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొనేందుకు భక్తజనం ఇంద్రకీలాద్రిపై పోటెత్తింది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఇదిలాఉంటే.. బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం సమర్పించడం ప్రతీయేటా ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఆదివారం తెలంగాణ మహాంకాళి ఉమ్మడి దేవాలయాల తరుపున దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనున్నారు.
Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన ఆషాడమాసం సారె
దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు 10టీతో మాట్లాడుతూ.. శాకాంబరీ దేవి దర్శనార్ధం వస్తున్న భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. మూడు రోజులపాటు లక్షల్లో భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేశామని, భక్తులకు అమ్మవారి కదంబ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేపు తెలంగాణ నుంచి బంగారు బోనం అమ్మవారికి సమర్పిస్తారని, ఆషాడ మాసంలో అమ్మవారికి సారె ఇచ్చేవారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఇదిలాఉంటే.. శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా తొలిరోజు శనివారం అమ్మవారి మూలవిరాట్ సహా ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు. ఇంద్రకీలాద్రిలో ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
Crow Temple Ringing Bell : గుడికి వచ్చి గుడి గంట మోగిస్తున్న కాకి .. అదీ పూజలు జరగని రోజుల్లోనే..!!
ఆషాడంలో అమ్మవారిని శాకంబరీగా అలంకరించి పూజించడం వల్ల ప్రకృతి వైపరిత్యాలు తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భక్తుల విశ్వాసం. శాకం అంటే కూరగాయలు. వివిధ రకాల కూరగాయలతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు. దీంతో ఈ సమయంలో అమ్మవారిని శాంకబరీదేవి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి మూడో తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై ఈ ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి ఆలయాన్ని వివిధ ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అండగా అలంకరించారు.