Indrakeeladri Sakambari Utsavalu
Shakambari Utsavalu : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో జూలై 22 నుంచి 24 వరకు 3 రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు కోరారు. ఆషాఢమాసంలో అమ్మవారికి సమర్పించే సారెను ధార్మిక సంస్ధల నిర్వహాకులు, భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…. భౌతిక దూరం పాటిస్తూ సమర్పించాలన్నారు.
అమ్మవారిని ప్రకృతి మాతగా కొలుస్తూ భక్తులు సమర్పించే కూరగాయలు, పండ్లు ఆకుకూరలతో మూల విరాట్ తో పాటు ఉపాలయాల్లోని విగ్రహాలను ఈ మూడు రోజులు అలంకరిస్తారు. శాకంబరీ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున కూరగాయలు విరాళంగా అందిస్తారు. భక్తుల నుంచి రాని కూరగాయలును కొనుగోలు చేయాలని చైర్మన్ సూచించారు.