×
Ad

Shubha Muhurtaalu : నవంబర్, డిసెంబర్ నెలల్లో శుభ ముహూర్తాలు ఇవే.. మోగనున్న పెళ్లిబాజాలు

Shubha Muhurtaalu : నవంబర్ నెల ప్రారంభమైంది. మళ్లీ మంచి ముహూర్తాలు వచ్చేశాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు

Shubha Muhurtaalu

Shubha Muhurtaalu : నవంబర్ నెల ప్రారంభమైంది. మళ్లీ మంచి ముహూర్తాలు వచ్చేశాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.

నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రావణమాసంలో శుభముహూర్తాలు ముగియడంతో శుభకార్యాలు ఆగిపోయాయి. అయితే, మళ్లీ శుభకార్యాలు మొదలు కానున్నాయి. కార్తీక మాసం ఉత్థాన ఏకాదశి విష్ణుమూర్తి మేల్కొనడం.. ద్వాదశి రోజున తులసీ మాతను వివాహం చేసుకోవడంతో సందడి మొదలైంది. నవంబర్ నెలలో 8వ తేదీ నుంచి ముహూర్తాలు షురూ కానున్నాయి.

నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు శుభ ముహూర్తాలు ఉండటంతో హడావిడి మొదలవుతోంది. పల్లెల నుంచి పట్టణాల వరకు పెళ్లిళ్లు సహా అన్ని శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లతో పాటుగా గృహ ప్రవేశాలకూ బలమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

నవంబర్ నెలలో మొత్తం 15రోజులు ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ నెలలో మూడురోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఇది 2026 సంవత్సరం జనవరి నెలలో సక్రాంతి వరకూ కొనసాగుతుంది.

మరోవైపు.. డిసెంబర్ 12వ తేదీ నుంచి అస్తమించిన శుక్రుడు తిరిగి ఫిబ్రవరి 1న ఉదయిస్తాడు. ఈ సమయంలో 51రోజుల పాటూ శుక్రబలం ఉండకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడనుంది.

నవంబర్ నెలలో 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30 తేదీల్లో.. డిసెంబర్ నెలలో 4, 5, 6 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. (కొన్ని పంచాంగాలలో తేడాలు ఉండటం వల్ల తేదీలు మార్పులు ఉండొచ్చు). డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 వరకూ ఉంటుంది. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించరు. ఆ తరువాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో మళ్లీ వివాహాల సీజన్ ప్రారంభమవుతుంది.