Tirumala Festivals : డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రులో జరిగే ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది.

Tirumala Festivals : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రులో జరిగే ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ 1 వ తేదీ నుండి దాదాపు 3 నెలలపాటు అంటే 2022, ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఋగ్వేద పారాయ‌ణం చేస్తారు.

డిసెంబ‌రు 2న ధ‌న్వంత‌రి జ‌యంతి
డిసెంబ‌రు 4న శ్రీ పద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో గ‌జ వాహ‌న‌సేవ సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యం నుండి పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ కాసులమాల ఊరేగింపు

డిసెంబ‌రు 8న పంచ‌మీ తీర్థం సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యం నుండి తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ప‌డి ఊరేగింపు
డిసెంబ‌రు 12న కార్తీక మాసం చివరి ఆదివారం శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు
డిసెంబ‌రు 14న గీతాజ‌యంతి
డిసెంబ‌రు 15న చ‌క్ర‌తీర్థ ముక్కోటి
Also Read : RSS Chief Mohan Bhagwat: ‘హిందువుల్లేకుండా ఇండియా లేదు.. ఇండియా లేకుండా హిందువుల్లేరు’
డిసెంబ‌రు 16 నుండి జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు ధ‌నుర్మాసం
డిసెంబ‌రు 18న ద‌త్త జ‌యంతి
డిసెంబ‌రు 19న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌ నిర్వహిస్తారు.

ట్రెండింగ్ వార్తలు