అయ్యప్పస్వాముల కోసం : శబరిమలకు ప్రత్యేక రైలు 

  • Publish Date - October 29, 2019 / 03:04 PM IST

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ తట్టుకునేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రత్యేక రైలును నడుపుతోంది. విశాఖపట్నం-కొల్లాం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2019, నవంబర్ 17 నుంచి 2020 జనవరి 21 మధ్య ఈ ప్రత్యేక రైలు 10 ట్రిప్పులు తిరుగుతుంది. 

రైలు నెంబరు 08515 నవంబర్ 17 ఆదివారం రాత్రి గం.11.50 ని.లకు విశాఖలో బయలుదేరి మంగళవారం ఉదయం గం.06.55 ని.లకు కొల్లాం చేరుకుంటుంది.  తిరుగు ప్రయాణంలో 08516 నెంబర్ తో ఈ ప్రత్యేక రైలు కొల్లాంలో మంగళవారం ఉదయం 10.00 గంటలకు బయల్దేరితే విజయవాడకు బుధవారం సాయంత్రం గం.6.30ని.లకు చేరుకుంటుంది. అయ్యప్ప స్వామి భక్తులకు ఈ ప్రత్యేక రైలు 10 ట్రిప్పులతో సేవలు అందించనుంది. 

విశాఖపట్నం నుంచి కొల్లాంకు నవంబర్ 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో, 
కొల్లాం నుంచి విశాఖపట్నానికి నవంబర్ 19, 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.