Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Srinivasa Klayanam

Srinivasa Klayanam :  తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో  ఈరోజ అమెరికాలోని సెయింట్ లూయిస్ లో శ్రీవారి కళ్యాణం వైభంగా జరిగింది.  అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున స్వామి వారి  కల్యాణ వేడుకను అర్చక స్వాములు  అంగరంగ వైభవంగా  నిర్వహించారు.

అద్భుతంగా అలంకరింప బడిన వేదికపై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తి సంగీత గానం నడుమ శాస్త్రోక్తంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు.

వేలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణ వేడుక చూసి తరించారు. కళ్యాణం అనంతరం భక్తుల నృత్య ప్రదర్శనల నడుమ గరుడ వాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు.

Also Read : Golconda Bonalu: గోల్కొండ బోనాల వేళ‌ పటిష్ఠ భ‌ద్ర‌త‌: సీఐ చంద్ర శేఖర్ రెడ్డి