Golconda Bonalu: గోల్కొండ బోనాల వేళ‌ పటిష్ఠ భ‌ద్ర‌త‌: సీఐ చంద్ర శేఖర్ రెడ్డి

గోల్కొండ బోనాల వేడుకల కోసం అధికారుల సూచనల మేరకు ఈ సారి భారీ భద్రతను ఏర్పాటు చేశామ‌ని ఆ ప్రాంత సీఐ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.

Golconda Bonalu: గోల్కొండ బోనాల వేళ‌ పటిష్ఠ భ‌ద్ర‌త‌: సీఐ చంద్ర శేఖర్ రెడ్డి

Bonalu In Hyderabad 2022

Updated On : June 28, 2022 / 4:18 PM IST

Golconda Bonalu: గోల్కొండ బోనాల వేడుకల కోసం అధికారుల సూచనల మేరకు ఈ సారి భారీ భద్రతను ఏర్పాటు చేశామ‌ని ఆ ప్రాంత సీఐ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. 10 టీవీతో ఇవాళ‌ ఆయ‌న‌ గోల్కొండ బోనాల‌పై మాట్లాడుతూ… సుమారు 800 మందికిపైగా పోలీసు సిబ్బందితో పాటు అదనంగా కొన్ని ప్లాటూన్ పోలీస్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దేవాలయ అవరణలో 60 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిఘా కట్టుదిట్టం చేశామ‌ని అన్నారు.

Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్‌నాథ్ షిండే

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి అవాంఛ‌నీయ ఘటనలు జరగ‌కుండా పికెట్స్‌తో పాటు ప్ర‌త్యేక‌ పోలీసు సిబ్బంది ద్వారా నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. షి టీమ్స్, క్రైమ్ టీమ్స్, గ‌స్తీ పోలీసులు, ఎస్‌బీ, ఇంటలిజెన్స్ ద్వారా భద్రతను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. మెటల్ డిటెక్టర్ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఉన్నాయని తెలిపారు. కాగా, గోల్కొండ బోనాల వేడుక‌ ఈ నెల 30న ప్రారంభం కానుంది.