Gold Biscuits Donation : తిరుమల శ్రీవారికి 3.604 కేజీల బంగారం బిస్కెట్లు విరాళం

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన స్దిరాస్తి వ్యాపార సంస్ధ  3.604 కేజీల బంగారం బిస్కట్లు విరాళంగా అందచేసింది.

Gold Biscut Donation

Gold Biscuits Donation :  తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన స్దిరాస్తి వ్యాపార సంస్ధ   3.604 కేజీల బంగారం బిస్కట్లు విరాళంగా అందచేసింది. కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్‌సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ రోజు ఉదయం శ్రీ స్వామి వారికి రూ. 1.83 కోట్లు విలువ చేసే 3.604 కేజీల బంగారం బిస్కట్లు కానుకగా అందచేశారు.

బుధవారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో సంస్ధ ప్రతినిధులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి బంగారం బిస్కట్లను అందచేశారు.