Tirumala Special Entry Darshan : సెప్టెంబర్ 23న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అక్టోబర్ నెలలో  దర్శించుకునేందుకు రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం టికెట్లను టీటీడీ ఈనెల 23న విడుదల చేయనుంది.

Special Darshan Tirumala

Tirumala Special Entry Darshan : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అక్టోబర్ నెలలో  దర్శించుకునేందుకు రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం టికెట్లను టీటీడీ ఈనెల 23న విడుదల చేయనుంది. 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచి తిరుమల వెబ్ సైట్ రోజుకు 8 వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచనున్నారు. ఈనెల 24 నుంచి సర్వదర్శనం(ఉచిత దర్శనం) టికెట్లను కూడా ఆన్ లైన్ లో ఉంచేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుపతి శ్రీనివాసం లో ఇస్తున్న సర్వదర్శనం టోకెన్లను ఈనెల 23 నుంచి నిలిపివేయనున్నారు.