తిరుమలలో 20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

ఈ నెల 20న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరాములవారు దర్శనమివ్వనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈనెల 20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24 వరకు తెప్పోత్సవాలు జరుగుతాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి వారు దర్శనమిస్తారు.

ఈ నెల 20న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరాములవారు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణుడు దర్శనమిస్తారు. చివరి ఈ నెల 22న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు దర్శనమిస్తారు.

ఈనెల 20, 21న సహస్ర దీపాలంకార సేవతో పాటు 22, 23, 24న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. తెప్పోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

మరోవైపు, శ్రీనివాస మంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిశాయి. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. ముందుగా కంకణ బట్టార్ శ్రీ శేషాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత చ‌క్ర‌స్నానం జ‌రిగింది.

Also Read: శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం.. ఇక్కడ జోలెపట్టి అడిగితే కష్టాలు తీర్చే ‘రామలింగేశ్వరుడు’..

ట్రెండింగ్ వార్తలు