TTD: మార్చి 28న అలిపిరిలో మెట్లోత్సవం
అన్నమాచార్యుల వర్ధంతి సందర్భంగా మెట్లోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 28వ తేదీ.

TTD
TTD: అన్నమాచార్యుల వర్ధంతి సందర్భంగా మెట్లోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 28వ తేదీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరగనుంది.
టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 6 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తర్వాత కళాకారులు సంకీర్తనా గానం చేస్తూ నడక మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. టీటీడీ అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి భజన మండళ్లకళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా మార్చి 29 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు, మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Read Also: 3నెలల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల రిలీజ్ డేట్ తెలిపిన టీటీడీ