ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

  • Publish Date - January 3, 2020 / 04:42 AM IST

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి  ఆర్జిత సేవలకు సంబంధించిన ఏప్రిల్ నెలలో లభించే  టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 65,280 ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,680 సేవా టికెట్లు, ఆన్‌లైన్ జనరల్ కేటగిరీలో 54,600 సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వున్నాయి.