Tirumala Break Darshan : తిరుమలలో 4వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబరు4వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.

Tirumala Vip Break Darshan

Tirumala Break Darshan :  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబరు4వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. ఈసందర్భంగా 4వ తేదీ వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

4వ తేదీ దీపావళి ఆస్థానం జరుగుతున్నందున పూజలకు ఇబ్బంది లేకుండా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

Also Read : PM Modi : కేదార్‌నాథ్‌లో ఆదిశంక‌రాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

ఇందులో భాగంగానే వీఐపీ బ్రేక్‌ కోసం 3వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోబోమని టీటీడీ స్పష్టం చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.