Diwali Lamps : దీపావళి రోజు దీపాలు ఎందుకు వెలిగించాలి?..లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వస్తుందా!..

దీపావళి రోజున ప్రతి ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించటంతోపాటు, దీపాలు వెలగించి అమ్మవారికి ఆహ్వానం పలుకుతారు.

Diwali Lamps : దీపావళి రోజు దీపాలు ఎందుకు వెలిగించాలి?..లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వస్తుందా!..

Deepawali (1)

Updated On : November 1, 2021 / 3:07 PM IST

Diwali Lamps : హిందూసాంప్రదాయం ప్రకారం నిర్వహించుకునే పండుగలలో దీపావళి పండుగకు ఎంతో విశిష్టమైన స్ధానం ఉంది. దీప అంటే దీపము…ఆవళీ అంటే వరుస…దీపావళీ అంటే దీపాల వరుస అని అర్ధం. దీపాలన్నింటిని సమూహంగా ఏర్పాటు చేయటంగా చెప్పవచ్చు. అమావాస్య రోజు రాత్రి అంతా చీకటి అలముకుంటుంది. ఈ దీపాలతో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపటం అనాదిగా వస్తున్న అచారం. చీకట్లో దుష్టశక్తులు ఉంటాయని నమ్ముతారు. దీపాలను వెలిగించటం ద్వారా తరిమికొట్టవచ్చని చాలా మంది నమ్మకం. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుఠం నుండి భూలోకానికి వచ్చి అందరి ఇళ్ళల్లో తిరుగుతుందని జనం విశ్వాసం. అందుకే దీపావళి రోజున ప్రతి ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించటంతోపాటు, దీపాలు వెలగించి అమ్మవారికి ఆహ్వానం పలుకుతారు.

దీపావళి రోజునే వామనుడు బలిని పాతాళానికి తొక్కేసిన రోజుగా చెప్తారు. అయోధలో రాముడి పట్టాభిషేకంతో రాజ్యపాలన ప్రారంభం అయిన రోజు కూడా ఇదే.. శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర వధ అనంతరం సంబరాలు జరిపిన రోజు,..విక్రమార్క శకానికి స్ధాపకుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభి శేఖం సైతం ఇదే రోజు జరిగింది. త్రేతాయుగం నుండి దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నట్లు పురాణగాధలు స్పష్టం చేప్తున్నాయి. వైకుంఠం నుండి ఈ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఆమెను పూజించిన వారందరిని అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తుంటారు. అదే క్రమంలో నరకచతుర్దశి రోజున ఎవరైతే నరకంలో ఉండే వాళ్ల కోసం దీపాలు పెడట్టం వల్ల వారు నరకం నుండి స్వర్గానికి వెళతారని శాస్త్రం చెబుతుంది.

దీపావళి రోజున సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. సూర్యోదయం తరువాత స్నానం చేసే వారు నరకానికి వెళతారని పెద్దలు చెబుతుంటారు. దీపావళి రోజున నువ్వుల నూనెతో తలంటుకోని అనంతరం స్నానం చేయాలి. అమావాస్య రోజుల్లో నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఆవహించి ఉంటుందని నమ్మకం. నీటిలో గంగాదేవి ఆవహించి ఉండడం చేత తలస్నానం చేయడం ద్వారా గంగా దేవి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. యమున్ని స్మరిస్తూ ఉత్తరేణి ఆకులను తలమీద ఉంచి స్నానం చేయడం ద్వారా యమ బాధ లేకుండా పోతుందట. రాత్రివేళలో ఈ దీపాల దీపావళి పండగను జరుపుకుంటారు.