83 Match Fee: 1983లో కపిల్‌దేవ్‌తో సహా టీమిండియా ఆటగాళ్ల జీతం ఎంతో తెలుసా?

1983 భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మకమైనది కాగా.. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.

83 Match Fee: 1983లో కపిల్‌దేవ్‌తో సహా టీమిండియా ఆటగాళ్ల జీతం ఎంతో తెలుసా?

World Cup

Updated On : December 24, 2021 / 4:36 PM IST

1983 Players Match Fee: క్రికెట్ ప్రపంచ కప్ 1983 భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మకమైనది కాగా.. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ప్రపంచ కప్ గెలిచిన జట్టు ఆటగాళ్ల జీతం ఎంతో తెలుసా? 1983లో వన్డే మ్యాచ్‌ల కోసం టీమిండియా ఆటగాళ్లు ఎంత జీతం తీసుకున్నారో తెలుసా?

ఆనాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతంకి సంబంధించిన ఒప్పందం కాగితం ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో కెప్టెన్ కపిల్ దేవ్, మొహిందర్ అమర్‌నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, రవిశాస్త్రి, మేనేజర్ బిషన్ సింగ్ బేడీ సహా 14 మంది ఆటగాళ్ల జీతం వివరాలు ఉన్నాయి. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుతో పాటు రోజువారీ భత్యంకు సంబంధించిన వివరాలు కూడా అందులో ఉన్నాయి.

21 సెప్టెంబర్ 1983 నాటికి సంబంధించిన స్లిప్‌లో ఆటగాళ్లందరి జీతం ప్రస్తావించి ఉంది. వారి వారి జీతాల పక్కన ప్లేయర్లు సంతకాలు కూడా చేసి ఉన్నారు. ఈ సమయంలో కపిల్ దేవ్‌కు మొత్తం మూడు రోజులకు రోజువారీ భత్యం రూ.600 ఇచ్చారు. అంటే, రోజుకు రూ.200 అన్నమాట. మ్యాచ్ ఫీజు రూ.1500 ఇచ్చారు. మొత్తం రూ.2100 ఇచ్చారు.

అదే జీతం వైస్ కెప్టెన్ మొహిందర్ అమర్‌నాథ్‌కు కూడా ఇచ్చారు. వీరితో పాటు సునీల్ గవాస్కర్, కె. శ్రీకాంత్, యశ్‌పాల్ శర్మ, సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్వీందర్ సంధు, దిలీప్ వెంగ్‌సాకర్, రవిశాస్త్రి, సునీల్ వాల్సన్‌లకు కూడా రూ.2100 ఇచ్చారు.