టీమిండియా ఆసీస్ టూర్ : ఇక వన్డేలు

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 10:39 AM IST
టీమిండియా ఆసీస్ టూర్ : ఇక వన్డేలు

Updated On : January 9, 2019 / 10:39 AM IST

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తరువాత చారిత్రక విజయం సాధించిన టీమిండియా విజయన్నా ఆస్వాదిస్తోంది. కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ విజయాన్ని భార్య అనుష్క శర్మ..సహచరులతో కలిసి గెలుపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు.
ఇక టెస్టులు ముగిశాయి. ఇక వన్డేలు ప్రారంభం కానున్నాయి. వన్డే జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాళ్లు సిడ్నీకి చేరుకున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బౌలర్ యుజువేంద్ర చాహల్ తదితరులు సిడ్నీకి వచ్చారు. రోహిత్, ధోనీతో కలిసి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరామని ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. 
ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు జనవరి 12వ తేదీ శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. టెస్టు సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన బుమ్రా స్థానంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు.