×
Ad

Abhishek Sharma : శ్రీలంక పై తుఫాన్ ఇన్నింగ్స్‌.. చ‌రిత్ర సృష్టించిన అభిషేక్ శ‌ర్మ‌..

టీమ్ఇండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) చ‌రిత్ర సృష్టించాడు. ఆసియాక‌ప్ టీ20 చ‌రిత్ర‌లో..

Abhishek Sharma creates history Most runs in single edition of T20 Asia Cup

Abhishek Sharma : టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆసియాక‌ప్ టీ20 టోర్నీ చ‌రిత్ర‌లో సింగిల్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. దుబాయ్ వేదిక‌గా శుక్ర‌వారం శ్రీలంకతో జ‌రిగిన మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాది 61 ప‌రుగులు చేయ‌డంతో ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో అత‌డు పాకిస్తాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ను అధిగ‌మించాడు. రిజ్వాన్ 6 ఇన్నింగ్స్‌ల్లో 281 ప‌రుగులు చేశాడు. ఇక అభిషేక్ 6 ఇన్నింగ్స్‌ల్లో 309 ప‌రుగులు సాధించాడు. వీరిద్ద‌రి త‌రువాత ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, ఇబ్ర‌హీం జ‌ద్రాన్ వంటి ఆట‌గాళ్లు ఉన్నారు.

Morne Morkel : హార్దిక్ పాండ్యా, అభిషేక్ శ‌ర్మ‌ల గాయాల‌పై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌.. పాక్‌తో ఆడ‌డం క‌ష్ట‌మేనా?

ఆసియా కప్ టీ20 చరిత్ర‌లో ఓ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* అభిషేక్ శర్మ (భార‌త్‌) – 6 ఇన్నింగ్స్‌ల్లో 309 ప‌రుగులు (2025లో)
* మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్‌) – 6 ఇన్నింగ్స్‌లలో 281 పరుగులు (2022లో)
* విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 5 ఇన్నింగ్స్‌లలో 276 పరుగులు (2022లో)
* ఇబ్రహీం జాద్రాన్ (అఫ్గానిస్తాన్‌) – 5 ఇన్నింగ్స్‌లలో 196 పరుగులు (2022లో)
* బాబర్ హయత్ (హాంగ్‌కాంగ్‌) – 3 ఇన్నింగ్స్‌ల్లో 194 ప‌రుగులు (2016లో)

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. అభిషేక్ శ‌ర్మ (31 బంతుల్లో 61 ప‌రుగులు), తిల‌క్ వ‌ర్మ (34 బంతుల్లో 49 నాటౌట్), సంజూ శాంస‌న్ (23 బంతుల్లో 39 ప‌రుగులు) దంచికొట్ట‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగులు చేసింది. అనంతరం పాతుమ్ నిస్సాంక (58 బంతుల్లో 107 ప‌రుగులు) కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) మెరుపులు మెరిపించ‌డంతో ల‌క్ష్య ఛేద‌న‌లో శ్రీలంక జ‌ట్టు కూడా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి స‌రిగ్గా 202 ప‌రుగులే చేసింది.

Charith Asalanka : అందుకే సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓడిపోయాం.. లేదంటేనా.. శ్రీలంక కెప్టెన్ చ‌రిత్ అస‌లంక కామెంట్స్

దీంతో మ్యాచ్ టై అయింది. సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించారు. సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత‌ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జ‌ట్టు 5 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 2 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. టీమ్ఇండియా తొలి బంతికే మూడు ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది.