Actress Samyuktha Of Bigg Boss Fame Engaged To Anirudha Srikkanth
Anirudha Srikkanth-samyuktha : అనిరుధ్ శ్రీకాంత్ గురించి క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, తొలి వన్డే ప్రపంచకప్ విన్నర్ అయిన క్రిష్ శ్రీకాంత్ కుమారుడు. కాగా.. అనిరుధ్ ఓ తమిళ బిగ్‌బాస్ బ్యూటి, నటిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె మరెవరో కాదు.. సంయుక్త
శ్రీకాంత్ కొడుకు అయిన అనిరుధ్ టీమ్ఇండియాకు ఆడాలని కలలు కన్నాడు. అయితే.. అతడి ఆశ నెరవేరలేదు. అయినప్పటికి కూడా అతడు ఐపీఎల్ ఆడాడు. ఐపీఎల్ అరంగ్రేట సీజన్ నుంచి 2013 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 20 మ్యాచ్‌లు ఆడాడు. 17 సగటుతో 136 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పి కామెంటేటర్ అవతారం ఎత్తాడు. ఇక అనిదుధ్ 2012లో ఆర్తి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. వీరి కాపురం ఎక్కువ కాలం కొనసాగలేదు.
ఇక సంయుక్త విషయానికి వస్తే.. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి 2007లో మిస్ చెన్నైగా నిలిచింది. ఆ తరువాత తమిళ బిగ్‌బాస్ సీజన్ -4లో పాల్గొని మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దీంతో ఆమె పలు సినిమాల్లో నటించింది. వారిసు, కాపీ విత్ లవ్, తుగ్లక్ దగ్భార్, మై డియర్ భూతం వంటి చిత్రాలతో ఆమె ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసింది.
Azam Khan : మ్యాచ్ మధ్యలో ఘోర అవమానం.. ఏడ్చేసిన పాక్ క్రికెటర్ ఆజం ఖాన్.. నాకు ఇజ్జత్ ఉందా?
తన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కార్తీక్ శంకర్‌ను పెళ్లిచేసుకుంది. వీరిద్దరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే.. మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.
దీపావళి వేళ..
అనిరుధ్ శ్రీకాంత్, సంయుక్తలు కలిసి ఇటీవల దీపావళి సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్త ప్రారంభాలు ఎల్లప్పుడూ కాంతితో ఉంటాయి అని రాసుకొచ్చారు. ఇక ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం అయిందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు.