Sourav Ganguly : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. గంగూలీ హాట్ కామెంట్స్.. ధ్రువ్ జురెల్ ఫామ్‌లో ఉన్నాడు..
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly ) తెలిపారు.
Ganguly Picks India Favourites For Test Series Against South Africa
Sourav Ganguly : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 14 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో రెండు జట్లలో ఈ సిరీస్‌లో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly ) తెలిపారు.
‘టీమ్ఇండియా ఫేవరెట్ ఎందుకంటే వారి స్పిన్ బలం చాలా బాగుంది. ఈ యువ జట్టు మూడు నెలల క్రితం ఇంగ్లాండ్ వెళ్లి అసాధారణంగా ఆడింది. శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రిషబ్ పంత్‌లు అసాధారణ ప్రదర్శనలు చేశారు.’ అని గంగూలీ అన్నాడు.
Shaheen Afridi : మీ అందరికి దండం పెడుతా.. బాగా ఆడండి రా అయ్యా.. పాక్ కెప్టెన్ అఫ్రిది కామెంట్స్ ..
ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో దక్షిణాఫ్రికా చాలా బాగా ఆడిందని, అయితే.. భారత్‌లో సఫారీలు రాణించాలంటే మాత్రం అంత సులభం కాదన్నాడు. భారత్‌లో భారత్‌తో తలపడాలంటే చెమటోడ్సాల్సి ఉంటుందన్నాడు.
ధ్రువ్ జురెల్ ను ఆడించాలి..
వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, మరోవైపు రిషబ్ పంత్ సైతం గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడన్నారు. ఈ విషయంలో సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారనో తనకు తెలియదన్నాడు. ఫామ్‌లో ఉన్న ధ్రువ్ జురెల్‌ను మూడో స్థానంలో ఆడిస్తారో లేదో నిజంగా నాకు తెలియదు లేదంటే సాయి సుదర్శన్‌కు అవకాశం ఇస్తారో చూడాల్సి ఉందన్నాడు. ఏమీ ఏమైనప్పటికి కూడా తుది జట్టులో పంత్ తో పాటు ధ్రువ్ జురెల్ ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
Azam Khan : మ్యాచ్ మధ్యలో ఘోర అవమానం.. ఏడ్చేసిన పాక్ క్రికెటర్ ఆజం ఖాన్.. నాకు ఇజ్జత్ ఉందా?
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.
