టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్; వార్మప్ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌పై అఫ్గానిస్థాన్ విజయం

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నమెంట్ సన్నాహాల్లో భాగంగా ఆయా దేశాలు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్; వార్మప్ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌పై అఫ్గానిస్థాన్ విజయం

Afghanistan 55 run victory against Scotland in WarmUp match (Photo Source: @ACBofficials)

Updated On : June 1, 2024 / 5:42 PM IST

T20 World Cup 2024 Warm Up Match: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఆయా దేశాలు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. తాజాగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌పై అఫ్గానిస్థాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. గుల్బాదిన్ నాయబ్ 68, అజ్మతుల్లా ఒమర్జాయ్ 48 పరుగులతో రాణించారు. మహ్మద్ నబీ 16, రషీద్ ఖాన్ 15 పరుగులు చేశారు. స్కాట్‌లాండ్‌ బాలర్లో క్రిస్ సోల్ 3, బ్రాడ్లీ క్యూరీ 2 వికెట్లు తీశారు.

సెకండ్ బ్యాటింగ్ చేసిన స్కాట్‌లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మార్క్(34), జార్జ్ మున్సే(28) మాత్రమే రాణించారు. అఫ్గానిస్థాన్ లో 9 మంది బౌలింగ్ చేశారు. ఇద్దరు మినహా మిగతా వారు వికెట్లు దక్కించుకున్నారు. కాగా, ఈరోజు రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగే వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, భారత్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: ఓ వైపు వ‌ర్షం.. మ‌రోవైపు ఫోటో కావాల‌ని అడిగిన అభిమాని.. రోహిత్, ద్ర‌విడ్‌ ప‌రుగో ప‌రుగు..!