Afghanistan secures historic first win over South Africa in international cricket
Afghanistan vs South Africa : యూఏఈ వేదికగా అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతున్నాయి. షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికా పై 6 వికెట్ల తేడాతో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. సౌతాఫ్రికాపై వన్డేల్లో అఫ్గాన్‌కు ఇదే మొదటి విజయం కావడం విశేషం. అంతేకాదండోయ్ బంతుల పరంగా (146 బాల్స్) టెస్టు ఆడే జట్ల పై సాధించిన మూడో అతి పెద్ద విజయం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. అఫ్గానిస్థాన్ బౌలర్లు సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలోనే 17/1, 24/2, 25/3, 29/4, 29/5, 36/6, 36/7.. ఇలా వరుసగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో వియాన్ ముల్డర్ (84 బంతుల్లో 52), జార్న్ ఫోర్టుయిన్ ( 34 బంతుల్లో 16) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఎనిమిదో వికెట్ కు 39 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని జోర్న్‌ను ఔట్ చేసి రషీద్ ఖాన్ విడదీశాడు.
వియాన్ తన కెరీర్‌లో తొలి అర్థశతకం సాధించగా దక్షిణాఫ్రికా 33.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్లా ఫరూకీ నాలుగు వికెట్లు తీశాడు. అల్లా గజన్‌ఫర్ మూడు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (0), రహ్మత్ షా (8), రియాజ్ హసన్ (16) లు విఫలం అయ్యారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (36 బంతుల్లో 25 నాటౌట్), గుల్బాదిన్ నైబ్ (27 బంతుల్లో 34 నాటౌట్) రాణించారు.
IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలానికి డేట్ ఫిక్స్!.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ టెన్షన్?