IND vs BAN : బంగ్లాతో తొలి టెస్టు.. గిల్ డ‌కౌట్‌.. టీమ్ఇండియా ఫ్యూచ‌ర్ కెప్టెన్ ఇత‌డేనా?.. నెట్టింట ట్రోలింగ్‌

టీమ్ఇండియాలో చోటు కోసం తీవ్ర‌మైన పోటీ ఉంది.

IND vs BAN : బంగ్లాతో తొలి టెస్టు.. గిల్ డ‌కౌట్‌.. టీమ్ఇండియా ఫ్యూచ‌ర్ కెప్టెన్ ఇత‌డేనా?.. నెట్టింట ట్రోలింగ్‌

Gill is Babar Azam of Indian cricket Twitter tears apart Shubman after another duck

Updated On : September 19, 2024 / 10:55 AM IST

IND vs BAN : టీమ్ఇండియాలో చోటు కోసం తీవ్ర‌మైన పోటీ ఉంది. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ధ్రువ్ జురెల్ వంటి ఆట‌గాళ్లు అవ‌కాశాల కోసం కాచుకుని కూర్చున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తుది జ‌ట్టులో చోటు ద‌క్కితే అద్భుతంగా రాణించి జ‌ట్టులో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల‌ని దాదాపు ప్ర‌తి ప్లేయ‌ర్ కోరుకుంటాడు. అయితే.. టీమ్ఇండియా ఫ్యూచ‌ర్ కెప్టెన్‌గా భావిస్తున్న శుభ్‌మ‌న్ గిల్ మాత్రం టెస్టు జ‌ట్టులో త‌న స్థానాన్ని ప్ర‌శార్థ‌కం చేసుకుంటున్నాడు.

చెపాక్ వేదిక‌గా గురువారం బంగ్లాదేశ్‌తో ప్రారంభ‌మైన తొలి టెస్టు మ్యాచు మొద‌టి ఇన్నింగ్స్‌లో డ‌కౌట్ అయ్యాడు. వ‌న్‌డౌన్‌లో బ‌రిలోకి దిగిన గిల్ 8 బంతులు ఎదుర్కొని ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే హసన్ మహమూద్ బౌలింగ్‌లో లిట‌న్ దాస్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. టెస్టుల్లో గిల్ ఇలా డ‌కౌట్ కావ‌డం ఇది ఆరోసారి.

IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలానికి డేట్‌ ఫిక్స్‌!.. ఫ్రాంచైజీల‌కు బీసీసీఐ డెడ్‌లైన్ టెన్ష‌న్‌?

ఇప్ప‌టి వ‌ర‌కు గిల్ తాజా టెస్టు మ్యాచుతో క‌లిపి 26 టెస్టులు ఆడాడు. 35.3 స‌గ‌టుతో 1492 ప‌రుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచ‌రీలు, ఆరు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. బ్యాటింగ్ యావ‌రేట్ ఫ‌ర్వాలేద‌నిపిస్తున్న‌ప్ప‌టికి మిగిలిన ఆట‌గాళ్లతో పోలిస్తే మాత్రం ఆందోళ‌న క‌రంగానే ఉంది. క‌నీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా భారీ స్కోరు చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌల‌ర్ హసన్ మహమూద్ ధాటికి వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌(6), గిల్ (0), విరాట్ కోహ్లీ (6)లు విఫ‌లం కావ‌డంతో 36 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ మూడు వికెట్ల‌ను కూడా హ‌స‌న్ మ‌హ‌మూద్ ప‌డ‌గొట్టాడు.

మేమింతే మారం..! సహనం కోల్పోయి బ్యాట్‌తో బలంగా కొట్టిన పాక్ ప్లేయర్.. వీడియో వైరల్

బంగ్లాదేశ్ పై డ‌కౌట్ కావ‌డంతో గిల్ పై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది. టీమ్ఇండియా బాబ‌ర్ ఆజాం అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.