After two ducks Virat Kohli opens his account in Australia series
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రీ ఎంట్రీలో ఇబ్బంది పడుతున్నాడు. దాదాపు ఏడు నెలల విరామం తరువాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతడు ఆసీస్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు అయ్యాడు. మొదటి వన్డే మ్యాచ్‌లో 8 బంతులు, రెండో వన్డేలో నాలుగు బంతులు ఆడి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కోహ్లీ (Virat Kohli) వన్డే కెరీర్‌లోనే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు ఇదే తొలిసారి.
ఈ క్రమంలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ కాకూడదని ఫ్యాన్స్ కోరుకున్నారు. వారు అనుకున్నట్లుగానే అతడు పరుగుల ఖాతా తెరిచాడు. ఆ తరువాత అతడు ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.
LOUDEST CHEER FOR KING KOHLI AT SCG…!!! 💪🙇 pic.twitter.com/QZfcTeIOF8
— Johns. (@CricCrazyJohns) October 25, 2025
మూడో వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా (56; 58 బంతుల్లో 2 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాత భారత్ 237 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగింది. 24 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రెండో బంతికి ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కారీ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.
గిల్ ఔట్ కావడంతో వన్‌డౌన్‌లో కోహ్లీ మైదానంలోకి వచ్చాడు. అతడు మైదానంలోకి వస్తుండగా.. స్టేడియం మొత్తం అతడి నామస్మరణతో మారుమోగిపోయింది. ఇక తాను ఎదుర్కొన్న తొలి బంతికే సింగిల్ తీసి ఈ సిరీస్‌లో పరుగుల బోణీ కొట్టాడు కోహ్లీ.
IND vs AUS : ఈజీ రనౌట్‌ను మిస్ చేసిన శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్.. రవిశాస్త్రి కామెంట్స్..
A CHEEKY CELEBRATION BY KOHLI AFTER TAKING 1 RUN. 😂 pic.twitter.com/LCqxMc3AZa
— Johns. (@CricCrazyJohns) October 25, 2025
ఇక కోహ్లీ సింగిల్ తీసిన వెంటనే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఇక కోహ్లీ కూడా సాధించాను అన్నట్లుగా తన పడికిడి బిగించి నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.