Ahead of the T20 World Cup 2026 icc has faced a severe blow after Jio hotstar pulling out of the contract
ICC : టీ20 ప్రపంచకప్ 2026కి భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగాటోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ వెల్లడించింది. కాగా.. ఈ టోర్నీ ప్రారంభానికి రెండు నెలల కంటే తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో ఐసీసీ (ICC )కి జియో హాట్‌స్టార్ షాకిచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మెగాటోర్నీ అధికారిక ప్రసారకర్తగా ఉన్న జియో హాట్‌స్టార్ తమ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ఐసీసీకి తెలియజేసినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత మీడియా హక్కుల కోసం ఐసీసీతో నాలుగేళ్ల కాలానికి (2024-27 ) జియో హాట్‌స్టార్ దాదాపు 3 బిలియన్ల డాలర్లతో ఒప్పందం చేసుకుంది.
IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఐసీసీ షాక్.. భారీ జరిమానా..
ఈ ఒప్పందం ప్రకారం మరో రెండేళ్లు కాంట్రాక్ట్ జియోకు ఉంది. అయినప్పటికి కూడా మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ను కొనసాగించలేమని చెప్పినట్లు సమాచారం. జియో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం.. ఆ ఫ్లాట్‌ఫామ్‌కు వస్తున్న భారీ ఆర్థిక నష్టాలే కారణం అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. 2026 నుంచి 2029 వరకు భారత మీడియా హక్కులకు సంబంధించిన ప్రక్రియను ఐసీసీ ప్రారంభించింది. ఇందు కోసం 2.4 బిలియన్ల డాలర్లను కోరింది. అయితే జియోస్టార్ ఉపసంహరణ ఐసీసీ ప్రణాళికలను గందరగోళంలో పడేసింది.
జియో వైదొలగడంతో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలను బిడ్ వేయాలని ఐసీసీ సంప్రదించింది. అయితే.. ఒప్పందం విలువ అధికంగా ఉండడంతో ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదట.
ప్రసారకర్త ఎవరూ నిర్ధారించకపోవడంతో 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ ప్రణాళికలు ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి.