National Record: ట్రిపుల్ జంప్‌లో నేషనల్ రికార్డ్ కొట్టేసిన ఐశ్వర్య
కర్ణాటకకు చెందిన బి.ఐశర్య అరుదైన రికార్డు బ్రేక్ చేశారు. అత్యధిక దూరం లాంగ్ అండ్ ట్రిపుల్ జంప్ చేసి గతంలో ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. SNJ నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ మీట్ లో భాగంగా సోమవారం జరిగిన ఈవెంట్ లో ట్రిపుల్ జంప్ లో నయా రికార్డు లిఖించారు.

Ashwin
National Record: కర్ణాటకకు చెందిన బి.ఐశర్య అరుదైన రికార్డు బ్రేక్ చేశారు. అత్యధిక దూరం లాంగ్ అండ్ ట్రిపుల్ జంప్ చేసి గతంలో ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. SNJ నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ మీట్ లో భాగంగా సోమవారం జరిగిన ఈవెంట్ లో ట్రిపుల్ జంప్ లో నయా రికార్డు లిఖించారు.
ఇదే తరహాలో పంజాబ్‌కు చెందిన కిర్పాల్ సింగ్ పురుషుల డిస్కస్ త్రోలో 2016లో నెలకొల్పిన (59.74 మీ) రికార్డును ప్రస్తుత ఈవెంట్ లో 60.31 మీటర్ల ఎత్తుతో అధిగమించి తన సొంత రికార్డును బద్దలు కొట్టాడు.
మయూఖా జానీ (14.11 మీ) నెలకొల్పిన 11 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ తన మూడో ప్రయత్నంలో 14.14 మీటర్ల దూకుడుతో రెండో స్వర్ణ పతకాన్ని అందించిన ఐశ్వర్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఐశ్వర్య ఈ ఏడాది తిరువనంతపురంలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో 13.94 మీటర్ల ఎత్తుతో ట్రిపుల్ జంప్ కట్ చేసింది.
Read Also : 31 ఏళ్ల వయసులో జో రూట్ అరుదైన రికార్డ్
“ఈ ఫీట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నా. సపోర్ట్ చేసినందుకు నా కోచ్ బీపీ అయ్యప్ప, ప్రమీల, జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. లాంగ్, ట్రిపుల్ జంప్ రెండింటిలోనూ రాణించాలనుకుంటున్నా’ అని ఐశ్వర్య వెల్లడించింది.