Virat Kohli: ‘సెలక్టర్లకు కోహ్లీకి ఉన్న సగం అనుభవం కూడా లేదు’
వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన తర్వాత ప్రెస్ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న విరాట్.. సంచలన కామెంట్ చేశాడు. ఆ విషయం తనకు ఓ గంటన్నర ముందు మాత్రమే తెలిసిందంటూ చెప్పడంతో....

Kohli
Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన తర్వాత ప్రెస్ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న విరాట్.. సంచలన కామెంట్ చేశాడు. ఆ విషయం తనకు ఓ గంటన్నర ముందు మాత్రమే తెలిసిందంటూ చెప్పడంతో అది చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాకు జట్టు ఎంపికకు గంటన్నర ముందే తనకు తెలిసిందని.. చెప్పడం ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ విషయంన్నా బీసీసీఐకే వదిలేద్దాం అని చెప్పడంతో సంచలనంగా మారింది.
1983వరల్డ్ కప్ విన్నింగ్ టీం ఆల్ రౌండర్ అయిన కీర్తి ఆజాద్.. కాంట్రవర్సీపై కామెంట్ చేశారు.
‘ఇది కూడా సెలక్టర్ల నిర్ణయమే అయితే.. ప్రెసిడెంట్ వరకూ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేను నేషనల్ సెలక్టర్ గా ఉన్నప్పుడు.. టీం సెలక్ట్ చేసకుని బోర్డ్ ప్రెసిడెంట్ ను కలిసే వాళ్లం. అతను కూడా చూసి సరే అంటేనే అనౌన్స్ చేసేవాల్లం. ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ పాటించాలి’
……………………………..: గంగూలీ కామెంట్ తర్వాత కోహ్లీకి సపోర్ట్‌గా ట్వీట్ల వరద
‘సెలక్టర్లు తీసుకున్న నిర్ణం సంతృప్తికరంగా లేదు. వాళ్లకు కోహ్లీకి ఉన్న సగం ఎక్స్‌పీరియెన్స్ కూడా లేదు. ఏ ఫార్మాట్‌కైనా కెప్టెన్సీ మార్చేటప్పుడు.. ప్రెసిడెంట్ కు ఇన్ఫామ్ చేయాలి. విరాట్ నిరుత్సాహపడలేదు. కానీ, అతనికి ఇన్ఫామ్ చేసిన పద్ధతి బాధాకరమైనది. ఒక్కసారైనా సౌరవ్ దగ్గరకు వెళ్లి ఉంటే అన్అఫీషియల్ గానైనా మాట్లాడి ఉండేవాడు. మీరే అర్థం చేసుకోవాలి. నేనేమీ చెప్పాలనుకోవడం లేదు. సెలక్టర్లంతా గొప్పవాళ్లు. కానీ, వాళ్లు ఆడిన మొత్తం మ్యాచ్ ల సంఖ్య చూస్తే కోహ్లీ ఆడిన వాటిలో సగం కూడా ఉండవు’ అని రిటైర్డ్ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.
……………………………………..: ‘టెస్టు కెప్టెన్‌గా కోహ్లీకిదే చివరి అవకాశం’