అంబానీ లగ్జరీ కార్ల గ్యారేజీలో ముంబై క్రికెటర్ల సందడి.. వీడియో వైరల్!

  • Published By: sreehari ,Published On : October 7, 2020 / 08:38 PM IST
అంబానీ లగ్జరీ కార్ల గ్యారేజీలో ముంబై క్రికెటర్ల సందడి.. వీడియో వైరల్!

Updated On : October 7, 2020 / 8:44 PM IST

Ambani exotic car garage : ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్.. అత్యంత విజయవంతైమన జట్లలో ఒకటి. రిలయన్స్ అధినేత, భారతీయ కుబేరుడు ముఖేశ్ అంబానీ ముంబై జట్టుకు యజమాని. దేశంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ హోం (Antilla) సందర్శించేందుకు ముంబై ఇండియన్స్ జట్టు వెళ్లింది. ఈ లగ్జరీ హోంలో చర్చలు, సమావేశాలు జరుగుతుంటాయి.



దేశంలో అత్యంత ఖరీదైన వాహనాలను అంబానీ ఫ్యామిలీ వినియోగిస్తోంది. ప్రతి ఏడాదిలో ఏదో కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తుంటారు. అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసిన ఖరీదైన లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయో ఇప్పటికే కొన్ని చూసే ఉంటారు.. అంబానీ యాంటిల్లా (Antilla)లోని 40,000 చదరపు అడుగల పార్కింగ్ ఏరియాలో ఇప్పటివరకూ చూడని కొన్ని లగ్జరీ కార్లను పార్క్ చేసి ఉంచారు.



ఈ వీడియో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ Cricket Fever లోనిది.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ UAEలో జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ఫుటేజీ కొన్ని ఏళ్ల క్రితంది.. అంబానీ గ్యారేజీలో కొత్త ఖరీదైన లగ్జరీ కార్లు చేరుతుంటాయి. కొన్ని అంబానీ కార్లను రోడ్లపై దర్శనమిస్తూనే ఉంటాయి. ముంబై ఇండియన్ ఆటగాళ్లు కూడా అంబానీ కార్లను చూడాలనే కోరిక కలిగింది.



యాంటిల్లాకు వెళ్లిన సందర్భంగా ముంబై క్రికెటర్లు గ్యారేజీలోని పార్కింగ్ దగ్గరకు వెళ్లారు. కార్ల దగ్గరకు వెళ్లి చూసి ముచ్చట తీర్చుకున్నారు. అప్పటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి అంబానీ యాంటిల్లాలో ఎన్ని కార్లు పార్క్ చేయవచ్చో కచ్చితంగా తెలియదు.

కానీ, కొన్ని రిపోర్టుల ప్రకారం ఆ గ్యారేజీలో 200 వరకు కార్లను పార్క్ చేసే విస్తీర్ణం ఉంటుందంట.. అంబానీ గ్యారేజీలో Bentley Bentayga, Mercedes-Benz E-Class, Mercedes-AMG G63 వంటి మరెన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి.