Andhra Cricket Association announces Rs 25 Lakhs to Nitish Kumar Reddy
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో సెంచరీ చేశాడు. టెస్టుల్లో నితీష్‌కు ఇదే తొలి సెంచరీ. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగి సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నితీష్‌కు భారీ నజరానా ప్రకటించింది. రూ.25లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందజేయనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
నితీష్ రెడ్డి అసాధారణ బ్యాటింగ్‌ను ఆయన కొనియాడారు. ఏసీఏ తరుపున నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని అందిచనున్నట్లు తెలిపారు.
Sunil Gavaskar : టెస్టుల్లో తొలి సెంచరీ.. నితీష్ కుమార్ రెడ్డికి సునీల్ గవాస్కర్ వార్నింగ్..
అమరావతిలో అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచులు ఆడేలా విశాఖ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ ఉండేలా ఏసీఏ ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా నితీష్‌రెడ్డిని అభినందించారు.
‘బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితీష్ కుమార్ రెడ్డికి అభినందనలు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచుల్లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. రంజీలోనూ ఆంధ్రా తరుపున ఎన్నో విజయాలు సాధించావు. అండర్ 16లో కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నావు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని, భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగి దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని చంద్రబాబు అన్నారు.
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో ఆస్ట్రేలియాతో మెల్బోర్నలో జరుగుతున్న క్రికెట్ నాలుగవ టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత… pic.twitter.com/93QcoWeTOx
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2024