‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మై లవ్‌’

‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మై లవ్‌’

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్‌లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ పట్టుదలతో అడిలైడ్‌ వేదికగా తలపడి సత్తా చాటింది. అద్భుతమైన విజయాన్ని ఆరు వికెట్ల తేడాతో సాధించింది. ఇక చివరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో ధోనీ ప్రదర్శనే కీలకంగా నిలిచింది. 

ఈ పర్యటనతో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలుచుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ద్వైపాక్షిక వ‌న్డే సిరీస్ నెగ్గిన టీమిండియాపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. టీమిండియాకు కంగ్రాట్స్ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. 
కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కూడా కోహ్లీ సేనను పొగడ్తలతో ముంచెత్తారు. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మై లవ్‌’ అంటూ భర్తను ప్రత్యేకంగా ప్రశంసించారు.

‘మరుపురాని, అద్భుతమైన పర్యటన ఇది. టీమిండియా చారిత్రక విజయాలను ప్రత్యక్షంగా చూసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరికీ అభినందనలు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మై లవ్‌’ అని విరాట్‌ కోహ్లీని ట్యాగ్‌ చేస్తూ అనుష్క ట్వీట్‌ చేశారు. 

 

ఆస్ట్రేలియా పర్యటనలో టీ20లను 1-1తో సమం చేశాక టెస్టులను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లీసేన.. అదే జోరు కొనసాగించి కంగారూల గడ్డపై తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో జయభేరీ మోగించింది.