మీరు మారరా: ఫంక్షన్‌లో కోహ్లీకి అనుష్క సీక్రెట్ ముద్దులు

మీరు మారరా: ఫంక్షన్‌లో కోహ్లీకి అనుష్క సీక్రెట్ ముద్దులు

Updated On : September 13, 2019 / 7:30 AM IST

ఫిరోజ్ షా కోట్లా షా స్టేడియానికి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని కేంద్ర నిర్ణయించింది. ఈ సందర్భంగా గురువారం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ వచ్చారు. కేంద్ర మోం మంత్రి అమిత్ షాతో పాటు టీమిండియా కోచ్ రవి శాస్త్రి, క్రీడా శాఖ మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పలువురి సమక్షంలో వేడుక జరిగింది. 

ఇదిలా ఉంటే క్రికెట్‌కు సంబంధించిన వేడుకకు కోహ్లీ భార్య అనుష్క ఎందుకొచ్చిందంటూ నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. ఇదే సమయంలో అనుష్కపైనే అందరికళ్లు ఉన్నాయి. పక్కనే కూర్చొని ఉన్న కోహ్లీ చేతిని పట్టుకుని అనుష్క ముద్దులు పెట్టడం కెమెరాలకు చిక్కాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. 

క్యూట్ కపుల్, అన్ కండిషనల్ లవ్, బెస్ట్ జోడీ, విరూష్కా జోడీ అద్భుతం అని కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ కూడా వీళ్లు ఇలానే ప్రవర్తిస్తారా, మీరు మారరా అంటూ ట్రోల్స్ విసిరేవాళ్లు ఉన్నారు. స్టేడియంలో సెంచరీ, హాఫ్ సెంచరీ, సిక్సులు ఇలా ప్రత్యేక సందర్భాల్లో అనుష్కకు కోహ్లీ గాల్లో ముద్దులు విసరడం చాలాసార్లు చూశాం. నిజానికి కోహ్లీ కార్యక్రమానికి రావడానికి మరో ప్రత్యేక కారణం స్టేడియంలో పెవిలియన్‌కు విరాట్ కోహ్లీ పేరు పెడుతుండటమే.