Ashton Agar Death Threat : పాక్ పర్యటనకు వస్తే.. నీ భర్త ఆస్ట్రేలియాకు ప్రాణాలతో తిరిగి వెళ్లడు..!

Ashton Agar Death Threat : ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ టీమ్ ఆల్‌రౌండర్ అష్టన్ అగర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. 2022 ఏడాదిలో పాకిస్తాన్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది.

Ashton Agar Death Threat : పాక్ పర్యటనకు వస్తే.. నీ భర్త ఆస్ట్రేలియాకు ప్రాణాలతో తిరిగి వెళ్లడు..!

Australia All Rounder Ashton Agar Receives Death Threat In Wife’s Social Media Handle Ahead Of Australia Vs Pakistan Series

Updated On : March 1, 2022 / 12:29 PM IST

Ashton Agar Death Threat : ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ టీమ్ ఆల్‌రౌండర్ అష్టన్ అగర్ (Ashton Agar)ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. 2022 ఏడాదిలో పాకిస్తాన్‌లో చారిత్రాత్మక ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు అష్టన్ అగర్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. అగర్ భార్య మెడ్‌లీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్తే.. ప్రాణాలతో తిరిగి ఆస్ట్రేలియా వెళ్లవు అంటూ మెసేజ్ లో రాసి ఉంది.

అష్టన్‌కు బెదిరింపులు రావడంతో ఆస్ట్రేలియా జట్టులో ఆందోళన మొదలైంది. అష్టన్ భార్యకు వచ్చిన ఇన్ స్టా మెసేజ్‌లో ‘మెడ్‌లీన్‌ మీరు బాగున్నారని ఆశిస్తున్నా. మీకో హెచ్చరిక.. మీ భర్త అష్టన్‌ అగర్‌ పాకిస్తాన్ పర్యటనకు వస్తే.. అతడు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లడు. కాదని అలాగే వస్తే.. మీ పిల్లలు తండ్రిని కోల్పోతారు. మావాళ్లు మీ భర్తను చంపేస్తారు’ అని మెసేజ్‌లు పంపారు.

1998 (24 ఏళ్ల సుదీర్ఘ విరామం) తర్వాత ఆస్ట్రేలియా పాక్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. క్రికెట్ ఆస్ట్రేలియా (CA), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రెండూ సోషల్ అకౌంట్లు ద్వారా అష్టన్ అగర్ భార్యకు పంపిన బెదిరింపు మెసేజ్‌పై దర్యాప్తు చేశాయి.
ఆ మెసేజ్‌లో అగర్ పాకిస్తాన్‌కు వెళ్లవద్దని హెచ్చరించినట్టుగా ఉంది. ఆమె వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఈ విషయాన్ని తెలిపింది.

Australia All Rounder Ashton Agar Receives Death Threat In Wife’s Social Media Handle Ahead Of Australia Vs Pakistan Series (3)

Australia All Rounder Ashton Agar Receives Death Threat In Wife’s Social Media Handle Ahead Of Australia Vs Pakistan Series 

అష్టన్ అగర్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు జట్టు ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. అయితే టీమ్ సెక్యూరిటీ దర్యాప్తు తర్వాత అందులో వాస్తవం లేదని కొట్టిపారేశాయి. ఎవరో కావాలనే ఇలా మెసేజ్ పంపి ఉంటారని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించాయి. ఈ మెసేజ్ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చినట్టు తేల్చేశారు.

ఆస్ట్రేలియా పాక్ పర్యటనలో భాగంగా మార్చి 4 నుంచి 25 వరకు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 5
వరకు పాకిస్తాన్‌లో కొనసాగనుంది.

Read Also : Rohit Sharma: బుమ్రాది గొప్ప క్రికెట్ మైండ్ – రోహిత్ శర్మ