Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. టెస్టుల్లో ఆసియాలో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా..

టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డును సాధించాడు.

Ashwin breaks Anil Kumble Indian record for most Test wickets in Asia

బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డును సాధించాడు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్ కుంబ్లే రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి రెండు వికెట్ల‌ను ఆకాశ్ దీప్ తీశాడు. కాగా.. మూడో వికెట్ అశ్విన్ ప‌డ‌గొట్టాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (31)ను ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఆసియాలో అత్య‌ధిక‌ టెస్టు వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 419 వికెట్లు తీయ‌గా తాజా వికెట్‌తో అశ్విన్ వికెట్ల సంఖ్య 420కి చేరింది.

Viral Video : ఇది అవ‌స‌ర‌మా చెప్పు.. వెళ్లేవాడిని గెలికితే.. పిచ్ పైనే కొట్టుకున్న బ్యాట‌ర్‌, బౌల‌ర్‌

ఇక ఓవ‌రాల్‌గా ఆసియాలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. అగ్ర‌స్థానంలో 612 వికెట్ల‌తో శ్రీలంక దిగ్గ‌జ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ ఉన్నాడు.

ఆసియాలో అత్య‌ధిక టెస్టు వికెట్లు తీసిన బౌల‌ర్లు..
ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (శ్రీలంక‌) – 612 వికెట్లు
ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 420* వికెట్లు
అనిల్ కుంబ్లే (భార‌త్‌) – 419 వికెట్లు
రంగ‌నా హెరాత్ (శ్రీలంక‌) – 354 వికెట్లు
హ‌ర్భ‌జ‌న్ సింగ్ (భార‌త్‌) – 300 వికెట్లు

Rohit Sharma : ఆకాశ్ దీప్ వికెట్ తీసిన త‌రువాత.. రోహిత్ శ‌ర్మ ఎపిక్ రియాక్ష‌న్ చూశారా? వైర‌ల్‌