Asia Cup 2023 : ఓట‌ముల చుట్టూ ప‌రిభ్ర‌మించిన విజ‌యం..!

ఆసియా క‌ప్ (Asia Cup) 2023 టోర్నీ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఆదివారం భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియ‌నుంది.

Asia Cup 2023 : ఓట‌ముల చుట్టూ ప‌రిభ్ర‌మించిన విజ‌యం..!

Asia cup 2023 memes

Asia Cup 2023 memes : ఆసియా క‌ప్ (Asia Cup) 2023 టోర్నీ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఆదివారం భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియ‌నుంది. భార‌త్, శ్రీలంక జ‌ట్ల‌లో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో మ‌రికొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

ఆరు జ‌ట్లు పాల్గొన‌గా రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూపు ద‌శ‌లో అఫ్గానిస్తాన్‌తో పాటు నేపాల్ ఇంటి దారి ప‌ట్ట‌గా సూప‌ర్‌-4కు పాకిస్తాన్‌, భార‌త్, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌లు వ‌చ్చాయి. కాగా.. సూప‌ర్-4 ద‌శ‌లో నిల‌క‌డ‌గా ఆడిన భార‌త్‌, శ్రీలంక లు ఫైన‌ల్‌కు చేరుకున్నాయి. అయితే.. సూప‌ర్-4 ద‌శ‌లో మ్యాచ్ ఫ‌లితాల‌కు సంబంధించిన ప‌లు మీమ్స్ వైర‌ల్ గా మారాయి.

అందులో ఓ మీమ్ ఆక‌ట్టుకుంది. సూప‌ర్‌-4 ద‌శ‌లో భార‌త జ‌ట్టు శ్రీలంక‌ను 41 ప‌రుగుల తేడాతో ఓడించింది. కాగా.. శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాక్‌పై విజ‌యం సాధించింది. అయితే.. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించ‌గా, బంగ్లాదేశ్ 6 ప‌రుగుల తేడాతో భార‌త్ పై గెలిచింది.

Asia Cup 2023 : శ్రీలంకతో ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌.. దినేశ్ కార్తీక్ ట్వీట్‌కు అర్థం అదేనా..?

ఈ మీమ్‌ వైర‌ల్‌గా మార‌గా నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. తాడిని త‌ల‌ద‌న్నె వాడు ఒక‌డు ఉంటే వాడి త‌ల‌ను ద‌న్నె వాడు ఒక‌డు ఉంటాడు అని ఒక‌రు కామెంట్ చేయ‌గా, ఓట‌ముల చుట్టూ ప‌రిభ్ర‌మించిన విజయం అని మ‌రో నెటీజ‌న్ అన్నాడు. భూమి గుండ్రంగా ఉంటుంద‌ని అన్నది ఎంత నిజ‌మే.. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వ‌స్తుంది. క‌ర్మ వ‌ద‌ల‌దు అంటూ మ‌రో నెటీజ‌న్ కామెంట్ చేశారు.